అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ మరో షాక్ .. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఎన్నికల నగారా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రసవత్తర రాజకీయాలు పంచాయతీ ఎన్నికల తర్వాత కూడా కొనసాగనున్నాయా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఎన్నికల నగారా మోగించబోతున్నారా ? ఇప్పటికే నిమ్మగడ్డను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో ఎన్నికలతో చుక్కలు చూపించబోతున్నారా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

 పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నగారా?

పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నగారా?

పంచాయతీ ఎన్నికల పోరులో బిగ్ ఫైట్ ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా కొనసాగుతోంది. దీంతోపాటు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఎన్నికల నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేస్తున్నారు నిమ్మగడ్డ. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల నగారా మోగించడానికి రెడీ అవుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఏపీ ప్రభుత్వానికి పరోక్షంగా వెల్లడించారు.

రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ ఆదేశం

రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలని ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ ఆదేశం


రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు అనుమతి ఇచ్చే విషయంపై జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించిన వాహనాల రంగులను వెంటనే మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనాలపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా కు సంబంధించిన రంగులు ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన రాజకీయ పార్టీలకు సంబంధం లేని రంగులు వేసి రేషన్ డోర్ డెలివరీ వాహనాలు తిప్పాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

 పంచాయతీ ఎన్నికలు కాగానే జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు అవకాశం

పంచాయతీ ఎన్నికలు కాగానే జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికలకు అవకాశం

పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తప్పనిసరిగా వాహనాలరంగులు మార్చాలని , అప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో డోర్ డెలివరీ వాహనాలకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
అయితే ఏపీ ప్రభుత్వానికి నిమ్మగడ్డ జారీ చేసిన ఆదేశాలతో జడ్పిటిసి ,ఎంపిటిసి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జరుగుతాయనే ఆసక్తికర చర్చ మొదలైంది.

 ఎన్నికల కమీషన్ మరో ఎన్నికలకు రెడీ అవుతుందా ? ఆసక్తికర చర్చ

ఎన్నికల కమీషన్ మరో ఎన్నికలకు రెడీ అవుతుందా ? ఆసక్తికర చర్చ


ఈ నెల 21వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. అది ముగిసిన వెంటనే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు షెడ్యూల్ ఇస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లోపు కూడా ఎన్నికల షెడ్యూల్ ఇవ్వొచ్చని ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో కరోనాకు మందు జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ కొంత కొనసాగిన నేపథ్యంలో దానిని పూర్తిగా రద్దు చేస్తారా ? ఆ ఎన్నికల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కరోనా కు ముందు నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో జరిగిన ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ విచారణ కొనసాగిస్తోంది.

 జగన్ కు మరో షాక్ .. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సర్కార్ అడ్డుకుంటుందా?

జగన్ కు మరో షాక్ .. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను సర్కార్ అడ్డుకుంటుందా?


ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉంటే వైసిపికి తీవ్ర నష్టం జరుగుతుందని భావించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ న్యాయస్థానాల సహకారంతో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటుగా జగన్ సర్కార్ కు చెమటలు పట్టించడానికి వెనువెంటనే జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలకు కూడా వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో ఏపీ లోని జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డను నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుందో వేచి చూడాలి.

English summary
The big fight contuinuing in AP over panchayat elections . nimmagadda vs jagan government continued their fight over elections .In addition, SEC is preparing for another election notification immediately after the panchayat elections. As soon as the panchayat elections are over, the ZPTC and MPTC elections may commence. He disclosed this to the AP government indirectly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X