ap politics ysrcp tdp పంచాయతీ ఎన్నికలు మంత్రులు వైసీపి టీడిపి nimmagadda ramesh kumar AP Panchayat elections 2021 AP Panchayat elections politics
టీడీపీకి మేలు చేస్తే ఎంపీ అవ్వొచ్చని నిమ్మగడ్డ అత్యాశ.అందుకే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి పెద్దిరెడ్డి
తిరుపతి/హైదరాబాద్ : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై వైసీపి నాయకుల ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. నగరి ఎమ్మెల్యే రోజా తో పాటు మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్ తో పాటు తాజాగా మంత్రి పెద్ది రాంచంద్రా రెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీకి మేలు చేస్తే ఎమ్మెల్సీ, ఎంపీని చేస్తారని నిమ్మగడ్డ అత్యాశకు గురవుతున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ సొంత జిల్లాల్లో కావాలనే ఏకగ్రీవాలను ఆపారని విమర్శించారు. అధికారులు ఎస్ఈసీ చెప్పినట్టు వింటామంటే మార్చి 31 తర్వాత చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు ఆ అధికారులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. అధికారులెవరూ ఎస్ఈసీ ఆదేశాలను లెక్కపెట్టకూడదని పిలుపునిచ్చారు. ప్రివిలేజ్ కమిటీకి నిమ్మగడ్డ సమాధానం చెప్పాల్సిందేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఎస్ఈసీ రమేష్‌కుమార్‌ను ఏపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. ఆయనపై మంత్రులు, వైసీపీ నేతలు మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. నిమ్మగడ్డ చర్యలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. కొన్ని సందార్భాల్లో ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. నిమ్మగడ్డపై మాటల దాడి చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరుసలో ఉన్నారు.
ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్లే పెద్దిరెడ్డి దృష్టంతా నిమ్మగడ్డపైనే ఉంది. నిమ్మగడ్డపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభాహక్కుల నోటీసు ఇచ్చారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ వీరిద్దరిపై గవర్నర్‌కు ఎస్ఈసీ ఫిర్యాదు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు, నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఈ-మెయిల్లో సభాహక్కుల నోటీసు పంపారు. చూస్తుంటే వైసీపి మంత్రుల మద్య ఎస్ఈసీ మధ్య యుద్ద వాతారణం ఎప్పుడు చల్లారుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి.