వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ రహస్య భేటీపై బీజేపీ ట్విస్ట్.. సుజనా, కామినేనిపై పార్టీ స్టాండ్ ఇది.. రాత్రి కాదుగా అంటూ..

|
Google Oneindia TeluguNews

'పార్క్ హయత్ లీక్స్' వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు కూడా రాజకీయ వేడి కొనసాగుతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా మళ్లీ పదవి చేపట్టేందుకు న్యాయపోరాటం చేస్తోన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ ను రహస్యంగా కలవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలు చేసేందుకే చంద్రబాబు డైరెక్షన్ లో ఆ భేటీ జరిగిందని అధికార వైసీపీ తీవ్ర ఆరోపణలు చేయగా.. అలాంటి ఉద్దేశమేదీ తమ వాళ్లకు లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ స్పష్టం చేసింది.

విజయసాయి కూడా దొరికిపోయాడుగా.. నిమ్మగడ్డ భేటీలో తప్పేంటి? అంతా జగన్నాటకమన్న టీడీపీ..విజయసాయి కూడా దొరికిపోయాడుగా.. నిమ్మగడ్డ భేటీలో తప్పేంటి? అంతా జగన్నాటకమన్న టీడీపీ..

షోకాజ్ నోటీసులు?

షోకాజ్ నోటీసులు?

పార్క్ హయత్ సీసీటీవీ ఫుటేజీల వీడియోలు సంచలనం రేపిన దరిమిలా.. ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ల తీరుపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఓ వైపు పార్టీ.. నిమ్మగడ్డ వ్యవహరంపై బహిరంగంగా పోరాటం చేస్తుంటే.. మీరెలా భేటీ అవుతారని అసంతృప్తి వ్యక్తమైనట్లు బీజేపీకి చెందిన సీనియర్ నేతలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఒక దశలో.. సుజనాకు బీజేపీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసిందంటూ ప్రచారం జరిగింది. కానీ చివరికి..

నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..నిమ్మగడ్డ అరెస్టుకు వైసీపీ డిమాండ్.. జగన్ సర్కారు సుమోటోగా.. కమలవనంలో పచ్చ పుష్పాలన్న అంబటి..

ఆ ఇద్దరికీ సమర్థన..

ఆ ఇద్దరికీ సమర్థన..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో భేటీ వ్యవహారంలో తమ పార్టీ నేతలైన సుజనా, కామినేనిలకు ఏపీ బీజేపీ అండగా నిలిచింది. అంతేకాదు, వారి చర్యలను సమర్థించే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేసింది. అందులో భాగంగా.. తానేతప్పూ చేయదన్న సుజనా వాదనను ఏపీ బీజేపీ అధికారిక ఖాతాల్లో షేర్ చేసింది. దాంతోపాటు పార్టీకి చెందిన పలువురు సీనియర్లు, జూనియర్లు సైతం సుజనా, కామినేని చర్యలో ఎలాంటి తప్పు లేదని, అధికార వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు.

కంగారొద్దు నేనే చెబుతా..

కంగారొద్దు నేనే చెబుతా..

సమర్థన చర్యల్లో భాగంగా ఏపీ బీజేపీ అధికారి ట్విటర్ ఖాతాలో సుజనా చేసిన ఓ కీలక పోస్టును రీట్వీట్ చేయడం గమనార్హం. ఎస్ఈసీ పదవిని తిరిగి పొందేందుకు న్యాయపోరాటం చేస్తోన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలిసినమాట వాస్తవమేనని, పార్టీ నేత కామినేని శ్రీనివాస్ ను కూడా అదే రోజు(జూన్ 13)న కలిశానని, అయితే రెండు భేటీలు విడివిడిగా జరిగాయే తప్ప ముగ్గురం కలిసి కూర్చోలేదంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఇదివరకే స్పష్టం చేశారు. తాజా ట్వీట్ లో వైసీపీని ఉద్దేశించి.. ‘‘నిమ్మగడ్డ, కామినేనిలు పార్క్ హయాత్ లోని నా ఆఫీసుకు వచ్చినందుకే హైరానా పడుతున్నరే.. మేం కలిస్తే తప్పేంటి? మీకంత భయమెందుకు? కంగారొద్దు.. నా రాజకీయాలు పారదర్శకంగా వుంటాయి. నేనేదైనా చెప్పే చేస్తా..''అని సుజనా రాసుకొచ్చారు.

Recommended Video

మళ్ళీ BC లకే అవకాశం.. AP Cabinet లో చోటు దక్కించుకోనున్న Jogi Ramesh & Ponnada Satish!
కలిసింది పగలే కదా..

కలిసింది పగలే కదా..

జగన్ సర్కారును ఇబ్బంది పెట్టేలా నిమ్మగడ్డతో కలిసి చంద్రబాబు ఏజెంట్లు చీకటి కుట్రలు పన్నుతున్నారంటూ సుజనా, కామినేనిలను ఉద్దేశించి వైసీపీ చేసిన విమర్శలను బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఖండించారు. ‘‘వాళ్లు కలిసింది రాత్రి కాదుగా.. పట్టపగలే పబ్లిక్ పేసులోనే కదా.. దానికి వైసీపీ ఎందుకింత రాద్ధాంత చేస్తోంది? అయినా.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను జగన్ ప్రభుత్వం ఇంకా ఎన్నికల కమిషన్ గానే గుర్తిస్తోందా? ఆయన పదవిలో లేనప్పుడు ఎవరి కలిస్తే వీళ్లకెందుకు?'' అని విష్ణుకుమార్ ఫైరయ్యారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరితోనైనా ఎవరైనా కలవొచ్చని, తమ పార్టీ నేతలు నిమ్మగడ్డతో మాట్లాడటం తప్పేకాదని ఆయన తేల్చిచెప్పారు.

English summary
political row continues for the second in andhra pradesh on videos of former sec nimmagadda ramesh kumar meeting with bjp mp sujana chowdary and kamineni srinivas. AP bjp backs their leaders in this isse. former vishnu kumar raju key remarks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X