వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లేది వైసీపి కదా.!మరి కాంగ్రెస్ వెళ్లిందేంటి..?అసలేం జరుగుతోంది

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ముహూర్తాన పదవి చేపట్టారో గానీ, పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇమడలేక, అలాగే ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చక ఘర్షణ పూరిత వాతావరణం చోటుచేసుకున్న సందర్బాలు కూడా లేకపోలేదు. చివరకు అసలు రమేష్ కుమార్ సేవలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ ఆర్డినెన్స్ ద్వారా ఆయనను తొలగించిన అంశం కూడా తెలిసిందే.

సుప్రీం గడప తొక్కిన నిమ్మగడ్డ రమేష్ అంశం.. సుప్రీం మెట్లెక్కింది వైసీపి కాదు... కాంగ్రెస్ పార్టీ నేత..

సుప్రీం గడప తొక్కిన నిమ్మగడ్డ రమేష్ అంశం.. సుప్రీం మెట్లెక్కింది వైసీపి కాదు... కాంగ్రెస్ పార్టీ నేత..

కానీ అనూహ్యంగా ఏపీ హైకోర్ట్ వైసీపి ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు రాజ్యంగ విరుద్దమని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో నిమ్మగడ్డ వ్యవహారంలో సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని వైసీపి నేతలు ప్రకటించారు. కాని వైసీపి నేతలు ఫైలు సిద్దం చేసుకుంటుండగానే కాంగ్రెస్ పార్టీ నేత సుప్రీంకోర్ట్ మెట్టేక్కేసారు. నిమ్మగడ్డ తిరిగి విధుల్లో చేరడం పట్ల కాంగ్రెస్ నేత అభ్యంతరం వ్యక్తం చేసారు. ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ ఇదే అంశంలో న్యాయం చెప్పాలని శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించి అందరిని ఆశ్యర్యానికి గురి చేసారు.

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకెళ్లిన కాంగ్రెస్.. కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి..

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టుకెళ్లిన కాంగ్రెస్.. కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి బాద్యతలు కట్టబెట్టాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత ఈ పిటీషన్ ధాఖలు చేయడం విస్మయానికి గురిచేస్తోంది.
ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ శనివారం సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియామకం చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కథనాలు వస్తున్న తరుణంలో ఏఐసీసీ కార్యదర్శి ముందుగానే సుప్రీం మెట్లెక్కి అందరిని ఆశ్చర్యానికి గురిచేసారు.

జగన్ సర్కార్ కంటే ముందుగానే.. ప్రత్యేక శ్రద్ద కనబరిచిన కాంగ్రెస్..

జగన్ సర్కార్ కంటే ముందుగానే.. ప్రత్యేక శ్రద్ద కనబరిచిన కాంగ్రెస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదన విన్నాకే ఆదేశాలు ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ తన కేవియట్ పిటిషన్‌లో కోరారు. ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉందని ముందుగానే కెవియట్ వేసినట్లు మస్తాన్ వలీ తెలిపారు. కాగా సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయనిఫుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్ధితిలో నిమ్మగడ్డ అంశంలో జారీ చేసిన ఆర్డినెన్స్ తప్పు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఏపి ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

Recommended Video

AP Govt Appoints G Vani Mohan As Secretary Of State Election Commission
న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపి.. వారంలోపు సుప్రీం గడపతొక్కే ఛాన్స్..

న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్న వైసీపి.. వారంలోపు సుప్రీం గడపతొక్కే ఛాన్స్..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంలో ఏపీ హైకోర్ట్ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను, ఏమరుపాటును పునరావృతం చేయకూడదని ఏపీ సర్కార్ కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం న్యాయనిపుణులతో లోతుగా చర్చించి సుప్రీంకోర్ట్ మెట్టెక్కాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అంశాలు అనుకూలిస్తే సోమవారం గాని లేక సెలవులు ముగిసిన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం విధానాలను కోర్టుకు సమర్థవంతంగా విన్నవించడంతో పాటు, ఆర్డినెన్స్ జారీ చేయడంలోని ప్రాముఖ్యతను స్పష్టంగా అత్యున్నత న్యాయస్థానానికి వివరించాలని, అందుకు నిష్ణాతులైన న్యాయకోవిదులను రంగంలోకి దించేందుకు వైసీపి ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది.

English summary
The YCP leaders have announced that they will settle the Supreme Court in the Nimmagadda affair. But when the YCP leaders are getting ready the files, the Congress leader filed petition in the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X