వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారం డ్యూటీలోకి నిమ్మగడ్డ- తొలి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి...

|
Google Oneindia TeluguNews

ఏపీ హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి ఎన్నికల కమిషనర్ గా నియామకమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన ఛాంబర్ లోనే నిమ్మగడ్డ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ఆయన బాధ్యతలు తీసుకుంటారని అధికారులు తెలిపారు.

సోమవారం లాంఛనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా గతంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రాష్ట్రంలో పలువురు ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

nimmagadda ramesh kumar to assume charge as sate election commissioner on monday

స్ధానిక ఎన్నికల వాయిదాకూ, ఈ బదిలీలకు సంబంధం లేదని వాదించిన జగన్ సర్కార్ వాటిని పక్కనబెట్టింది. ఆ తర్వాత నిమ్మగడ్డ స్వయంగా సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బాధ్యతలు తీసుకోగానే తాను గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తారా లేక మరో ఆదేశం ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతానికి ఎలాగో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేకపోవడంతో అప్పటి వరకూ చేపట్టాల్సిన చర్యలపై మాత్రం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిమ్మగడ్డ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఓసారి అధికారులతో ఇదే విషయంపై సమీక్ష నిర్వహించారు.

English summary
nimmagadda ramesh kumar to assume charge as state election commissioner on monday. officials have been made arrangements in vijayawada office in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X