• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీగా: జగన్ సర్కార్ లెక్కచేయలే, వ్యవస్థలే మిన్న: సోమిరెడ్డి, బీజేపీ విష్ణు ఫైర్

|

హైకోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తిరిగి ఎస్ఈసీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అయితే దీనిపై టీడీపీ, బీజేపీ స్పందించాయి. చివరకు వ్యవస్థలే గెలిచాయని తెలిపాయి. రాష్ట్ర ఎన్నికల అధికారి విషయంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కి.. కడకు తలొంచక తప్పలేదు అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోన్ రెడ్డి మండిపడ్డారు. నిమ్మగడ్డ విషయంలో నేర్చుకున్న నీతి ఏంటీ బీజేపీ నేత విష్ణు ప్రశ్నించారు.

అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం..

వితండ వాదనలు..

వితండ వాదనలు..

నిమ్మగడ్డ రమేశ్ తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా పునర్నియామకం విషయంలో ప్రభుత్వ తీరు తప్పని సామాన్య జనం కూడా అభిప్రాయపడ్డారు అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కానీ దానిని సీఎం జగన్ మాత్రం లెక్కచేయలేదన్నారు. అందుకోసమే కోర్టు మెట్లెక్కి... చివరకు తీర్పును అమలు చేయక తప్పలేదన్నారు. వాస్తవానికి జగన్ సలహాదారులకు నాలెడ్జ్ లేనట్టుంది అని మండిపడ్డారు. అందుకోసమే వితండవాదం చేసి మరీ.. అపకీర్తి పాలయ్యారని గుర్తుచేశారు. తిరిగి తిరిగి.. అదే స్థానంలో రమేశ్‌ను కూర్చొబెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

వ్యవస్థలే మిన్న..

వ్యవస్థలే మిన్న..

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో నేర్పిన నీతి ఏంటి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవస్థ ముందు నేతలు చిన్న అని మరోసారి రుజువైందన్నారు. దీనికి తాజా ఉదహరణ నిమ్మగడ్డ ఉదంతం అని చెప్పారు. దీంతో పెద్దలు మెల్లగా మబ్బుల్లోంచి నేల మీదకు దిగి వస్తున్నారని.. రాక తప్పదని ఆయన ట్వీట్ చేశారు.

 ఎస్ఈసీగా నియామకం

ఎస్ఈసీగా నియామకం

హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి నియమించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు. గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. అయితే స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీం ఇచ్చే తీర్పుకు లోబడే పదవీ పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేసింది.

తిరస్కరణ

తిరస్కరణ

ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ పదవీ కాలం కుదింపు, కొత్త కమిషనర్‌గా జస్టిస్ కనగరాజును నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. తిరిగి రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని పలుమార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టు తిరస్కరించింది.

  Nepal Communist Party లో సంక్షోభం, భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం
  ఈ లోపు నియామకం..

  ఈ లోపు నియామకం..

  హైకోర్టు తీర్పును అమలుచేయట్లేదంటూ నిమ్మగడ్డ కోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీనిపై స్టే ఇవ్వాలంటూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా మరోసారి చుక్కెదురైంది. స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. ఏపీ హైకోర్టులో జరగబోయే పరిణామాలపై తదుపరి అఫిడవిట్ దాఖలు చేస్తామని నిమ్మగడ్డ తరఫు లాయర్ కోరగా, అందుకు సుప్రీంకోర్టు వారం రోజులు గడువిచ్చింది. ఇంతలోనే ఏపీ ప్రభుత్వం ఎస్ఈసీగా రమేష్‌ కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

  English summary
  nimmagadda re-appointed as sec slapped to jagan government ex minister somireddy chandramohan reddy alleged.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X