వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ రాకతో ఆ అధికారుల గుండెల్లో రైళ్లు... నాటి ఆదేశాలు అమలయ్యేనా ?

|
Google Oneindia TeluguNews

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టడం ఆయన ప్రత్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అదే సమయంలో ఆయన గతంలో బదిలీ చేసినా ఇప్పటికే మారకుండా అక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు సైతం అదే పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో నిమ్మగడ్డ వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

నిమ్మగడ్డ కేసు తీర్పుపై ఉత్కంఠ- అమరావతిలో బెట్టింగ్ ల జోరు... ఎవరెంతంటే ?నిమ్మగడ్డ కేసు తీర్పుపై ఉత్కంఠ- అమరావతిలో బెట్టింగ్ ల జోరు... ఎవరెంతంటే ?

నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులు వీరే....

నిమ్మగడ్డ బదిలీ చేసిన అధికారులు వీరే....

ఈ ఏడాది మార్చి నెలలో కరోనా వైరస్ కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడే నాటికి ఎన్నికల అక్రమాలకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బదిలీ చేశారు. వీరిలో గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, గుంటూరు రూరల్ ఎస్పీ, చిత్తూరు అర్బన్ ఎస్పీ, మాచర్ల పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు, పలమనేరు, శ్రీకాళహస్తి డీఎస్పీలు ఉన్నారు.

బదిలీలు అమలు చేయని ప్రభుత్వం...

బదిలీలు అమలు చేయని ప్రభుత్వం...

అప్పట్లో ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న అధికారుల బదిలీ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో వీరిని బదిలీ చేయలేదు. దీనిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసినా దాన్ని పట్టించుకోలేదు. ఆ లోపే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి నిమ్మగడ్డను తొలగించడం, ఆయన స్ధానంలో జస్టిస్ కనగరాజ్ ను నియమించడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఈ వ్యవహారం మరుగునపడింది.

Recommended Video

Tirumala Temple Plans To Open Doors To Devotees
 మళ్లీ నిమ్మగడ్డ రాకతో...

మళ్లీ నిమ్మగడ్డ రాకతో...


హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పటి ఆదేశాలను తిరిగి అమలు చేయాలని ప్రభుత్వానికి సూచిస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. అయితే అప్పటి నిర్ణయాన్ని అమలు చేయాల్సిందేనని నిమ్మగడ్డ పట్టుబడితే మాత్రం ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. ఇప్పుడు ఇదే అంశం అప్పట్లో బదిలీ అయిన అధికారుల్లో ఆందోళన రేపుతోంది. ఎస్ఈసీగా తిరిగి నియమిస్తూ హైకోర్టు ఆదేశాలు వెలువరించగానే వెంటనే బాధ్యతలు చేపడుతున్నట్లు ప్రకటన జారీ చేసిన నిమ్మగడ్డ.. అధికారుల బదిలీల విషయంలోనూ దూకుడుగా ముందుకెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

English summary
andhpradesh state election commissioner nimmagadda ramesh's re entry as sec may create troubles to then transferred officials during local body polls. because state govt not implement his orders yet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X