అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాలంటీర్లకు ఎన్నికల విధులొద్దు: ఎస్పీ, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో నిమ్మగడ్డ

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులతో, జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ , డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు . స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్న నిమ్మగడ్డ

ఎన్నికల ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలన్న నిమ్మగడ్డ

వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు నిమ్మగడ్డ . ఎన్నికల ప్రక్రియను మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా పరమైన అంశాలపై చర్చించిన ఆయన సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు వ్యవహరించవలసిన తీరుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలు స్వాగతించాలని, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాల్ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.

ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశం .. అవసరమైతే ప్లాన్ బీ

ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశం .. అవసరమైతే ప్లాన్ బీ

ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచాలన్నారు . వారికి ఎలాంటి విధులు కేటాయించవద్దని తేల్చి చెప్పారు. ఎన్నికల బందోబస్తుకు అవసరమైతే ప్లాన్ బి కూడా ఉపయోగిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర బలగాలను అవసరమైతే రంగంలోకి దించి ఆలోచనలో కూడా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్లాన్ బీ పై ప్రస్తావించారు. ఎన్నికల ప్రక్రియ మొదటి ప్రాధాన్యత అని, అలాగని కరోనా వ్యాక్సినేషన్ ఆప వద్దు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

Recommended Video

AP Panchayat Elections 2021 : AP Govt Announced Incentives Where Elections Held Unanimously
గొడవలు, అసాంఘిక చర్యలపై యాప్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలన్న నిమ్మగడ్డ

గొడవలు, అసాంఘిక చర్యలపై యాప్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలన్న నిమ్మగడ్డ

ఎన్నికల నేపథ్యంలో గొడవలు, అసాంఘిక చర్యలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు రావొచ్చని రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక యాప్ తీసుకు వచ్చిందని దాని ద్వారా ఫిర్యాదులు పంపివచ్చని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడం కోసం చేయాల్సిన అన్ని పనులను నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులతో చర్చించారు . ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని, అవి కొంత దూరం మాత్రమే రికార్డ్ చేస్తున్నాయని పేర్కొన్న ఆయన, ఇబ్బందిగా ఎన్నికలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

English summary
As part of Panchayat elections, the SEC held a video conference with higher offcials on elections . Nimmagadda Ramesh Kumar has made it clear that no responsibilities should be handed over to village volunteers in local body elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X