AP Panchayat elections AP Panchayat elections 2021 nimmagadda ramesh kumar east godavari district andhra pradesh ys jagan amaravati vijayawada ap local body elections local body elections ramesh kumar high court tdp chandrababu naidu ap government తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ వైయస్ జగన్ అమరావతి విజయవాడ స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు టిడిపి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం politics
గొల్లలగుంటలో మృతుడు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి నిమ్మగడ్డ పరామర్శ .. వారిని వదిలిపెట్టేది లేదని వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో గొల్లలగుంట సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పుష్పవతి భర్త శ్రీనివాస్ అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఈ ఘటనకు వైసీపీనే బాధ్యులని, శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ నేతలు చంపేశారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గొల్లలగుంటలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ధ్వంసమైన కారులోనే సీఎం జగన్ దగ్గరకు వెళ్లేందుకు పట్టాభి యత్నం .. దాడిపై పట్టాభి భార్య ,తల్లి ఆవేదన

శ్రీనివాస్ రెడ్డి కుటుంబంతో ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్న నిమ్మగడ్డ
శ్రీనివాస్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన, నిష్పాక్షిక విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. రాజకీయాలు చెయ్యాల్సిన సమయం ఇది కాదని, నిందితులు ఎంతటివారైనా తప్పకుండా శిక్ష పడుతుందని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. పోస్టుమార్టం పారదర్శకంగా జరిపిస్తామని పేర్కొన్నారు . గొల్లలగుంట గ్రామ పంచాయతీ ఎన్నికల అంశాన్ని తర్వాత పరిశీలిస్తామని పేర్కొన్నారు.

శ్రీనివాస్ రెడ్డి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన నిమ్మగడ్డ
ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదని, మానవతా దృక్పథంతో చూడాలని పేర్కొన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. శ్రీనివాస్ రెడ్డి మృతికి కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ మృతిపై దర్యాప్తు సక్రమంగా జరిగేలా చూస్తానని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అయితే సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పుష్పవతి భర్త శ్రీనివాస్ ఆదివారం అర్ధరాత్రి అపహరణకు గురయ్యారు, నిన్న రాత్రి పొలం లో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు . అయితే అది ఆత్మహత్య అని కొందరు, వైసీపీ నేతలే అతనిని హతమార్చారని మరికొందరు శ్రీనివాస్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీనివాస్ రెడ్డిని వైసీపీ నేతలే చంపేశారని టీడీపీ ఆరోపణలు
ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి మృతికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.
మరి ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తారో తెలియాల్సి ఉంది . మరోపక్క టీడీపీ నేతలు అధినేత చంద్రబాబు టీడీపీ బలపరిచిన అభ్యర్థి పుష్పవతి భర్త శ్రీనివాస్ ను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి చంపేశారని ఆరోపిస్తున్నారు .