వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్ఈసీ వర్సెస్ సర్కార్: నిమ్మగడ్డపై మంత్రి అనిల్ విసుర్లు, బాబు అజెండా ఫాలో అని ధ్వజం..

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఎస్ఈసీ, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికలను నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్ఈసీ వర్సెస్ సర్కార్ మధ్య మాటల యుద్దమే జరుగుతోంది. తిరిగి నిమ్మగడ్డ రమేశ్.. నియామకం కాగా... స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఆదేశాలతో ఎస్ఈసీ ముందడుగు వేశారు. ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించగా.. అధికార వైసీపీ హాజరుకాలేదు. అన్నీ పార్టీలు కలిసి ఎన్నికలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఏకగ్రీవ అయిన వారికి కూడా ఎన్నికలను నిర్వహిస్తారు. ఇప్పటికీ ఏపీలో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ భావిస్తోండగా.. అందుకు సర్కార్ మాత్రం సుముఖంగా లేదు.

 లోకేష్ ఓ వేస్ట్‌ ఫెలో... దేవినేని ఉమా .. గన్ తో కాల్చుకో : మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు లోకేష్ ఓ వేస్ట్‌ ఫెలో... దేవినేని ఉమా .. గన్ తో కాల్చుకో : మంత్రి కొడాలి నానీ తీవ్ర వ్యాఖ్యలు

అనిల్ గుస్సా..

అనిల్ గుస్సా..

నిమ్మగడ్డ రమేశ్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఆయన ప్రతిపక్ష నేత అజెండాను అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు డైరెక్షన్‌ చేస్తే నిమ్మగడ్డ యాక్టింగ్ చేస్తున్నారని ఆరోపించారు. వారు ఏం చెబితే ప్రభుత్వం అదీ చేయాలా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎక్కడ లేనివిధంగా స్కూళ్లను సీఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకోవాలని.. ఇంట్లో కూర్చొని మాట్లాడటం సరికాదన్నారు. సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని అనిల్ కుమార్‌ తెలిపారు.

హైకోర్టు ఆదేశాలతో కదలిక..

హైకోర్టు ఆదేశాలతో కదలిక..

పంచాయతీ ఎన్నికలపై ఇదివరకు హైకోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించింది. ఎన్నికల నిర్వహణపై ఇబ్బందులు ఏమిటని ఎస్ఈసీని ప్రశ్నించింది. దీంతో ఎన్నికల నిర్వహణ గురించి రాజకీయ పార్టీలతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బుధవారం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి వైసీపీ హాజరుకాలేదు. దీంతో ప్రతిష్టంభన ఏర్పడింది.

Recommended Video

Nimmagadda Ramesh Kumar Case Coming To Hearing On June 10 In Supreme Court
మార్చివరకు నో

మార్చివరకు నో

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ముగిసి.. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చేవరకు స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశంలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. ఆయన పదవీకాలం వచ్చే మార్చితో ముగియనుంది. అప్పటివరకు కాలం వెళ్లదీయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు కరోనా వైరస్ వల్ల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా వైరస్ పేరు చెప్పి ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తుండటం విశేషం. ఈ క్రమంలో ప్రభుత్వానికి-ఎస్ఈసీకి మళ్లీ కొల్డ్ వార్ తప్పదని తెలుస్తోంది.

English summary
ap sec nimmagadda ramesh kumar work with tdp chief chandrababu naidu guidelines minister anil kumar alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X