జగన్! తేలు కుట్టిన దొంగలా మారాడు: చినరాజప్ప ఎద్దేవా
వైయస్సార్ కంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుపై జగన్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
తూర్పుగోదావరి: వైయస్సార్ కంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దనోట్ల రద్దుపై జగన్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి అం శాన్ని రాజకీయం చేసే జగన్ ఈ వ్యవహారంలో తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన దగ్గర నల్లధనం ఉండడమే ఇందుకు కారణమన్నా రు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ముద్రగడ పద్మనాభం చేపట్టే పాదయాత్రకు అనుమతి తప్పనిసరి అన్నారు.

1994 తర్వాత 30ఏళ్లపాటు కాపులను మరిచిపోయిన ముద్రగడ తాజాగా కాపుల రిజర్వేషన్లపై మాట్లాడడం రాజకీయ ఎదుగుదల కోసమేనన్నారు. రాష్ట్రంలో ఇకపై ఆందోళనలు, అల్లర్ల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుందని సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతోపా టు పోలీసులకు బాడీ కెమెరాలు అందిస్తున్నామన్నారు. దీని ద్వారా రౌడీయిజం, భూకబ్జాలు తగ్గుతాయన్నారు.
రాష్ట్రానికి కొత్త రూ.500 నోట్లు వస్తే సామాన్యులకు ఇబ్బందులు తగ్గుతాయని ఇప్పటికే ముఖ్యమంత్రి రూ.10 వేల కోట్లు కావాలని లేఖ రాశారని తెలిపారు. రూ.2 వేల నోట్లు వలన పెద్ద ఉపయోగం లేదన్నారు.












Click it and Unblock the Notifications