• search
 • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖలో జగన్ రాబంధులు వాలాయి: కబ్జా, రౌడీయిజం అంటూ రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు

|

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిప్పులు చెరిగారు. అంతరించిపోయిన రాబందులు.. జగన్ బంధువుల రూపంలో మళ్లీ వచ్చాయని, ఆ రాబందులు ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్యర్యం విశాఖలోని విలువైన భూముల్ని కజ్జా చేస్తున్నాయని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

విశాఖలో కబ్జాలు, రౌడీయిజాలే..

విశాఖలో కబ్జాలు, రౌడీయిజాలే..

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో పర్యటించిన టీడీపీ నిజనిర్ధారణ కమిటీకి వైసీపీ నేతలు చేస్తున్న కబ్జాలు, రౌడీయిజాలు కమిటీ దృష్టికి వచ్చాయి. విశాఖలోని భూములపై ప్రేమతోనే జగన్ పాలన సాగిస్తున్నారు. అందుకే నాడు విజయమ్మ విశాఖలో ఓడిపోతుందని తెలిసి కూడా జగన్ సొంత జిల్లా అయిన కడప నుంచి పోటీ చేయించకుండా విశాఖ నుంచి పోటీ చేయించారన్నారు రామానాయుడు.

విశాఖ భూములపై విజయసాయి కన్ను..

విశాఖ భూములపై విజయసాయి కన్ను..

విజయసాయిరెడ్డి నెల్లూరు జిల్లా వాసి అయినా.. అక్కణ క్షణం గడపకుండా విశాఖలోనే తిష్ట వేశారు. కన్నతల్లిపై, సొంత జిల్లాపై కంటే జగన్, విజయసాయిరెడ్డిలు విశాఖ భూమలుపై ప్రేమ చూపిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో అక్కడ భూములు దోచుకునేందుకు సిద్దమయ్యారు. విశాఖపై జగన్‌కి నిజంగా ప్రేమ ఉంటే లులు, అదానీ డేటా సెంటర్లు వెళ్లిపోతుంటే ఎందుకు ఆపలేదు. భావనపాడు ను ప్రాజెక్టును ఎందుకు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర సుజలా స్రవంతికి ఎందుకు నిధులు కేటాయించలేదు. కేంద్రం వెనుకబడిని జిల్లాలకు ఇవ్వాల్సిన బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వమని కేంద్రాన్ని వైసీపీ ఎంపీలు ఒక్క రోజైనా అడిగారా? అని రామనాయుడు ప్రశ్నించారు.

విశాఖను ఐటి హబ్‌గా మార్చేందుకు నాడు చంద్రబాబు నాయుడు రూ. 180 కోట్లతో మిలీనియం టవర్ నిర్మిస్తే ...ఇప్పుడు జగన్ అమరావతి నుంచి అక్కడకు సచివాలయం తరలిచేందుకు దానిలో కంపెనీలను వెళ్లగొట్టి అక్కడ యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. పాదయాత్రలో విశాఖ జిల్లాలోని పెందుర్తి సభలో ల్యాండ్ పూలింగ్ తాను వ్యతిరేమన్న జగన్ నేడు 6,200 ఎకరాల ల్యాండ్ పూలింగ్ సేకరణకు ఆదేశాలు ఎందుకు జారీ చేశారు.? దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే నష్టపోతారు. బిల్డ్ ఏపీ పేరుతో విశాఖలోని 4 వేల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మకానికి సిద్దం చేసిన జగన్ మరో వైపు ల్యాండ్ పూలింగ్ పేరుతో పేదల నుంచి 6 వేల ఎకరాలను లాక్కోవటం విడ్డూరంగా ఉందని రామానాయుడు వ్యాఖ్యానించారు.

  BJP Kanna Lakshminarayana Press Meet About YS Jagan Delhi Tour | Oneindia Telugu
  జగన్ పన్ను.. ఆశ్రమాలు, మిషనరీలు ఇక అంతే..

  జగన్ పన్ను.. ఆశ్రమాలు, మిషనరీలు ఇక అంతే..

  విశాఖలో అమ్మిన భూముల ద్వారా వుడాకు ఆదాయం వస్తుందని మళ్లీ దానికి ప్రజల నుంచే జగన్ పన్నులు కట్టిస్తారు. వైసీపీ నేతలు విలువైన ప్రభుత్వ, ప్రవేట్ భూములు కబ్జా చేస్తున్నారని విశాఖ ప్రజలు కూడా చెప్పారు. దానిపై టీడీపీ జ్యడిషియల్ ఎంక్వైరీ వేయమంటే ప్రభుత్వాం ఇప్పటి వరకు ముందుకు రాలేదు. దీన్న బట్టే అక్కడ వైసీపీ నేతలు భూ కజ్జటాలకు పాల్పడ్డారని స్పష్టంగా అర్ధమవుతోంది. విజయసాయిరెడ్డి అల్లుడి సన్నిహితుడు అరవిందో ఫార్మా గొలుసు కట్టు కంపెనీల కోసం భూములు కాజేస్తున్నారు. పాదయాత్రలో తగరపు వలస జూట్ మిల్లును తెరిపిస్తానన్న జగన్... నేడు ఆ యాజమాన్యాన్ని బెదిరింపులకు గురిచేసి ఆస్థలం కాజేందుకు వైసీపీ నేతలు ప్రయత్నం చేస్తేున్నారు. సిరిపురం జంక్షన్ లో వేల కోట్ల విలువైన అక్కడి క్రైస్తవ మిషనరీల భూములు కొట్టేసి స్టార్ హోటల్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆనందపురంలో మండలంతో ఉన్న రాజుల భూమి 50 ఎకరాలు కూడా కొట్టేసేందుకు ఫ్రణాళకిలు రూపొందించారు. వాల్తేరు, దసపల్లా భూములు కొట్టయటమే కాకుండా ఆశ్రమ స్ధలాలు కూడా వదలంటం లేదు. విజయసారెడ్డి కుదిరేతే నయానా, లేకుంటే బయనా అన్న ఫార్ములాతో విజయసాయిరెడ్డి భూమలు కబ్జా చేస్తున్నారన్నారు రామానాయుడు.

  నేషనల్ హైవే సమీనంపలో వెంకోజిపాలెంలో 1955 సంవత్సరం నుంచి ఉన్న దయానందా స్వామీజీ ఆశ్రమానికి 9 ఎకరాల భూములున్నాయి. వాటి విలువల ప్రస్తుతం రూ. 450 కోట్లు ఇప్పటికే విశాఖ ఎంపీ ఆశ్రమం పడమరవైపు కొన్ని భూములు ఆక్రమించి నిర్మాణాలు చేసేందుకు సిద్డపడ్డారు. దేవాదాయ శాఖ మంత్రి, మంత్రి అవంతి, ద్రోణంరాజ్ శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే లు ఆశ్రమ భూమిని ప్రవేట్ ట్రస్టుకు అప్పగించమని లేఖ రాశాంరటే వైసీపీ అవినీతి ఏ రేంజ్ లో ఉందో అర్దమవుతోంది. పోలీసు ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు ఆ ఆశ్రమ నిర్వాహకులను బెదిరిస్తున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే అమరావతి, విశాకలోని భూ కజ్జాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.

  English summary
  TDP MLA nimmala ramanaidu hits out ys jagan and vijayasai reddy.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X