వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తోడుగా సీతారామన్ నామినేషన్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజ్యసభ సీటుకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తెలుగుదేశం మద్దతుతో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె వెంట వచ్చారు. ఆమె చేత నామినేషన్ దాఖలు చేయించారు. ఆయనతో పాటు మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు ఇతర నాయకులు ఉన్నారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు చేయడానికి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. శుక్రవారంనాడు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశారు. తాను మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిసినట్లు చెప్పారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేశారు. పక్కన ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్

తన నామినేషన్ పత్రాలను నిర్మలా సీతారామన్ ఎపి శాసనసభా సచివాలయం కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణ రావుకు అందించారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్

రాజ్యసభ సీటుకు నామినేషన్ దాఖలు చేసిన నిర్మలా సీతారామన్ వెంట కాల్వ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తెలంగాణ బిజెపి నేత, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు బండారు దత్తాత్రేయ కూడా వచ్చారు.

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్

నిర్మలా సీతారామన్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు బిజెపి నేత బండారు దత్తాత్రేయ వచ్చారు.

English summary
Nirmala Sitharaman filed Rajya Sabha nomination With Chief minister of A.P N.Chandra Babu Nadiu at secretary Assembly & returning officer K Satyarayana Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X