వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్‌కు, తెలుగింటి కోడలుకు ప్రమోషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్రమంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు రక్షణశాఖ మంత్రిత్వశాఖను అప్పగించారు. ప్రధానమంత్రి మోడీ తన మంత్రివర్గాన్ని ఆదివారం నాడు పునర్వవ్యస్థీకరించారు. అయితే ఈ సందర్భంగా రక్షణశాఖను ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా సీతారామన్‌కు దక్కింది.

నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరకాల ప్రభాకర్‌ను వివాహం చేసుకొంది. నిర్మలా సీతారామన్ బిజెపిలో కీలకంగా వ్యవహరించారు. దీంతో మోడీ క్యాబినెట్‌లో ఆమెకు చోటు దక్కింది.

కేంద్రమంత్రివర్గంలో నిర్మలా సీతారామన్‌కు ప్రమోషన్ దక్కిందని బిజెపివర్గాలు అభిప్రాయంతో ఉన్నాయి. నిర్మలా సీతారామన్ తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేయడంతో మోడీ ఆమెకు ప్రమోషన్ కల్పించారనే అభిప్రాయంతో కొందరు పార్టీ నేతలున్నారు.

ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు వాణిజ్య పన్నుల శాఖ సహయమంత్రిగా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగానే మోడీ రక్షణశాఖను అప్పగించారు.

నిర్మలా సీతారామన్‌కు పెద్దపీట.. తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి

నిర్మలా సీతారామన్‌కు పెద్దపీట.. తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి

కేంద్ర మంత్రివర్గంలో నిర్మలా సీతారామన్‌కు మోడీ పెద్దపీట వేశారు. తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో మొండిచేయి చూపారు. తెలంగాణ నుండి ప్రాతినిథ్యం వహించిన బండారు దత్తాత్రేయను మంత్రివర్గం నుండి తప్పించారు.కర్ణాటక నుండి నిర్మలాసీతారామన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఎంపికైన బిజెపి ఎంపీలకు ప్రాధాన్యత దక్కలేదు. మంత్రివర్గంలో ఉన్న దత్తన్న చోటు కోల్పోయారు.విశాఖ ఎంపీ హరిబాబుకు కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కుతోందని భావించినా చివరి నిమిషంలో ఆయనకు నిరాశే ఎదురైంది.

ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖకు నిర్మలా సీతారామన్

ఇందిరాగాంధీ తర్వాత రక్షణ శాఖకు నిర్మలా సీతారామన్

ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను చేపట్టిన మహిళ మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. సాధారణంగా రక్షణశాఖను సీనియర్లకు కేటాయిస్తారు. కానీ, నిర్మలా సీతారామన్ వాణిజ్యపన్నులశాఖ మంత్రిగా చూపిన ప్రతిభ ఆధారంగా ఆమెకు మోడీ ఈ కీలకమైన బాధ్యతలను అప్పగించారు. దాయాదీ దేశాలతో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రక్షణ శాఖ బాధ్యతల్లో నిర్మలా సీతారామన్‌కు ఈ బాధ్యతలు కీలకంగా మారనున్నాయి. కొత్త మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

ఆ నలుగురిని అభినందించిన మోడీ

ఆ నలుగురిని అభినందించిన మోడీ

మంత్రివర్గ విస్తరణ తర్వాత మోడీ నలుగురు మంత్రులను అభినందించారు. రాష్ట్రపతి భవన్‌లో మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ నలుగురికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసినవారందరికీ ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. వారి అనుభవం, తెలివితేటలు మంత్రివర్గానికి గొప్ప విలువను తెచ్చిపెడతాయని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో ప్రత్యేకంగా నలుగురికి అభినందనలు తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్‌, పీయూష్ గోయల్, నిర్మల సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలను మోదీ అభినందించారు. ఈ నలుగురికీ తాజాగా కేబినెట్ మంత్రులుగా పదోన్నతి లభించిన సంగతి తెలిసిందే. ధర్మేంద్ర ప్రధాన్ పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయ మంత్రిగా ఇప్పటి వరకు పని చేశారు. నఖ్వీ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగానూ, నిర్మల సీతారామన్ వాణిజ్యం, పరిశ్రమల శాఖ స్వతంత్ర సహాయ మంత్రిగానూ, పీయూష్ గోయల్ విద్యుత్తు, బొగ్గు, నవీన, పునరుత్పాదక ఇంధనం శాఖల సహాయ మంత్రిగానూ పని చేశారు. వీరి పనితీరు పట్ల మోదీ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పనితీరు ఆధారంగానే కేబినెట్‌లో చోటు

పనితీరు ఆధారంగానే కేబినెట్‌లో చోటు

పనితీరు ఆధారంగానే మోడీ కేబినెట్‌లో చోటు దక్కింది. అంతేకాదు 2019 ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం మోదీ తన టీమ్‌ను ఎంపిక చేసుకొన్నారని చెప్పవచ్చును. పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మోడీ కేబినెట్ ఎంపిక చేసుకొన్నారు.కేబినెట్‌లో పనితీరు సక్రమంగా లేని నేతలను ఇతర అవసరాలకు ఉపయోగించుకోవాలని మోడీ భావించారు. ఈ మేరకు కొందరికి ఉద్వాసన కల్పించారు. వయస్సుతో పాటు ఎన్నికలున్న రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు.

English summary
Nirmala Sitharaman, who was promoted to the cabinet today, is the country's new Defence Minister. She takes charge of the crucial ministry from Arun Jaitley, who has been saying for some time that he would like to focus his attention entirely on the Finance Ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X