వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి నేనేం చేశానా: పెద్ద లిస్ట్ చూపిన నిర్మలా సీతారామన్, ఎవరికి కౌంటర్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఇటీవలి వరకు ఏపీ నుంచి బీజేపీ తరఫున రాజ్యసభలో ప్రాతినిథ్యం వహించిన నిర్మలా సీతారామన్ ఈసారి కర్నాటక నుంచి పెద్దల సభకు వెళ్తున్నారు. రెండేళ్ల పాటు ఏపీ నుంచి పెద్దల సభకు వెళ్లి ఆమె ఏం చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆమె స్పందించారు.

ఏపీ అభివృద్ధికి తానేం చేశానే ఆమె వివరించారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ (ఎంపిల్యాడ్) పథకం నిధులలో మీకు రాజ్యసభ ప్రాతనిథ్యాన్ని కల్పించిన ఏపీకి ఎన్ని ఖర్చు పెట్టారు? అన్న ప్రశ్నకు ఆమె శనివారం ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు.

ఎంపి ల్యాడ్ పథకం క్రింద తనకు కేటాయించిన మొత్తం నిధులను ఏపీలోని వివిధ అభివృద్ధి పథకాలకే వినియోగించానని పేర్కొన్నారు. భీమవరం, విశాఖలను ఎక్స్‌పోర్ట్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా ప్రకటించానన్నారు.
ఎగుమతులకు సంబంధించిన వౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశానన్నారు.

 Nirmala Sitharaman lists out development initiatives for Andhra Pradesh

తాత్కాలికంగా విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుకు అమరావతిలో స్థలాన్ని గుర్తించామని, ఐఐఎఫ్‌టి కోసం భూమిని కూడా గుర్తించామన్నారు. దీనికి త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు.

అలాగే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఏర్పాటుకు త్వరలో శంకుస్థాపన జరగనుందన్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటైందని, భారీ పెట్టుబడులకు, ఉపాధికి దోహదపడేలా ఆసియా అభివృద్ధి బ్యాంక్ సహకారంతో విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను తీసుకొచ్చానన్నారు.

ఏపీ మీదుగా చెన్నై-బెంగళూరు కారిడార్‌ను తీసుకెళ్లామని, దీనివల్ల రాయలసీమలోని నేషనల్ ఇన్వెస్టుమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పొగాకు రైతుల గురించి కూడా శ్రద్ధ వహించానన్నారు. పొగాకు ధరలు పతనమవుతున్న సమయంలో బాసటగా నిలిచానన్నారు.

తూర్పు తల్లు, పెదమాయినవానిలంక గ్రామాలను సౌరశక్తి ఆధారంగా విద్యుత్‌ను పొందుతున్న తొలి గ్రామాలుగా మార్చానని చెప్పుకొచ్చారు. కేవలం ఇవన్నీ కూడా తమ పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో తాను చేసినవని చెప్పారు.

అదే సమయంలో చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయని, చూస్తూనే ఉండండి, ప్రశ్నించండని ఆమె ట్వీట్ చేశారు. నిర్మలా సీతారామన్ తీరుపై అసంతృప్తి మధ్య ఈసారి రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు అవకాశమిచ్చిన విషయం తెలిసిందే.

దీంతో సీతారామన్ ఇప్పుడు కర్నాటక నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయతే ఈ పరిణామాల నేపథ్యంలో సీతారామన్ ఏపీకి చేసిందేమీ లేదంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో తన హయాంలో చేసిన అభివృద్ధి పనులను ఆమె ఏకరువు పెట్టారు. అయితే, నిర్మలకు టిడిపి నేతలు రెండోసారి పదవి వద్దని చెప్పిందని, ఈ నేపథ్యంలో టిడిపికే ఆ కౌంటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Listing out initiatives she has taken for development of Andhra Pradesh as the Rajya Sabha member from the state, Union Minister Nirmala Sitharaman on Saturday said she has utilised the entire amount under the MPLAD scheme and facilitated setting up of several projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X