• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వెలగపూడి ఇంటికి సాయిబాబా ఫోటోతో నిర్మల హంగామా .. సాయి రెడ్డి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్

|

విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి నేతల మధ్య రాజకీయ సునామీ అంతకంతకు పెరుగుతోంది. టిడిపి ఎమ్మెల్యే వైసిపి నేతల మధ్య సత్య ప్రమాణ సవాళ్ళతో విశాఖ నగరం అట్టుడికిపోతోంది. ఇక వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జి విజయ నిర్మల సాయి బాబా ఫోటో తో ఏకంగా వెలగపూడి నివాసానికి వెళ్లడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాను రమ్మన్నది విజయసాయినని విజయసాయిరెడ్డి వస్తే ప్రమాణం చేస్తానని ట్విస్ట్ ఇచ్చారు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.

దేవుళ్ళతో గేమ్స్ ఆడేస్తున్న ఏపీ వైసీపీ , టీడీపీ నేతలు .. సత్యప్రమాణాల సవాళ్ళతో దేవుళ్ళకు తప్పని తిప్పలు

 వెలగపూడిపై భూకబ్జా ఆరోపణలు చేసిన విజయసాయి .. రగడ మొదలైంది అక్కడే

వెలగపూడిపై భూకబ్జా ఆరోపణలు చేసిన విజయసాయి .. రగడ మొదలైంది అక్కడే

తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని అధికారులు ఇటీవల కూల్చివేతకు దిగడంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు భూకబ్జా వ్యవహారం మీద ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు అండతో టిడిపి నేతలు వేల కోట్లు విలువ చేసే భూములను అక్రమంగా దోచేశారు అంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా సరే ప్రభుత్వ ఉక్కుపాదం మోపుతోంది అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

సాయిబాబా ఆలయానికి రా ..విజయసాయికి సవాల్ చేసిన వెలగపూడి

సాయిబాబా ఆలయానికి రా ..విజయసాయికి సవాల్ చేసిన వెలగపూడి

ఇక విజయసాయిరెడ్డి పోస్ట్ పై స్పందించిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇస్తావా? ఒక గజం కూడా ఆక్రమించలేదు అని నిరూపణ అయితే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తావా? తన పేరులోనే సాయి ఉన్న విజయసాయిరెడ్డి తన ఆరోపణలపై నిజాయితీగా దర్యాప్తు చేయిస్తానని సాయిబాబా విగ్రహం దగ్గర బాండ్ పేపర్ పై రాసిస్తారా అంటూ సవాల్ చేశారు. అయితే దీనికి విశాఖ తూర్పు ఇంచార్జ్ తాను వస్తానంటూ సవాల్ చేసారు . అంతేకాదు ఏకంగా సాయి బాబా ఫోటోతో వెళ్లి ఉద్రిక్తత మరింత పెంచారు.

 విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ ... దేవుడి ఫోటోతో వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జ్ హంగామా

విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ ... దేవుడి ఫోటోతో వైసీపీ విశాఖ తూర్పు ఇంచార్జ్ హంగామా

విశాఖలో ఈ రోజు అక్రమాస్తులపై వెలగపూడి ప్రమాణం చేయాలంటూ వైసిపి కార్యకర్తలు, భూ కబ్జాలపై విజయసాయిరెడ్డి ప్రమాణం చేయాలంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. వెలగపూడి రామకృష్ణ ఆఫీస్ దగ్గర ప్రమాణం నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అంటూ దేవుడు ఫోటో పట్టుకొని వైసీపీ విశాఖ తూర్పు ఇన్ చార్జ్ విజయనిర్మల హంగామా సృష్టించారు. పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా భద్రతా ఏర్పాట్లను చేశారు.

వెలగపూడి ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించిన నిర్మలను అడ్డుకున్న పోలీసులు

వెలగపూడి ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నించిన నిర్మలను అడ్డుకున్న పోలీసులు

వెలగపూడి నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించిన నిర్మల రోడ్డు మీద పోలీసులు అడ్డుకున్నారు. 11 గంటలకు ప్రమాణం చేస్తానని సమయం ఇచ్చిన వెలగపూడి ఇంతవరకు బయటకు రాలేదని నిర్మల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తాను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వస్తే ఎక్కడ ప్రమాణం చేయమన్నా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఎక్కడైనా ఓకే సాయి బాబా పాదాల వద్ద స్టాంప్ పేపర్ పై రాసుకుని విజయసాయిరెడ్డి రావాలని పేర్కొన్నారు.

విజయసాయి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్

విజయసాయి రావాలని టీడీపీ ఎమ్మెల్యే ట్విస్ట్

విజయసాయి వచ్చి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని, నిరూపించ లేకపోతే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలని వెలగపూడి రామకృష్ణ బాబు డిమాండ్ చేశారు . అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ కు సైతం సింహాద్రి అప్పన్న గుడికి తాను వస్తానని చెప్పిన వెలగపూడి రామకృష్ణబాబు , అయితే తొలుత తాను చెప్పిన సాయిబాబా ఆలయానికి రావాలంటూ సవాల్ చేశారు. తూర్పు నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రతి సవాళ్లతో, సత్య ప్రమాణాల హడావిడితో రాజకీయ సునామీ రసవత్తరంగా మారింది.

English summary
In Visakhapatnam, the political tsunami between TDP MLA Velagapudi Ramakrishnababu and YCP leaders is on the rise. The city of Visakhapatnam is reeling from the oaths of TDP MLAs and YCP leaders. The situation became more tense when YCP Visakhapatnam East in-charge Vijaya Nirmala went to Velagapudi residence with a photo of Sai Baba. Velagapudi Ramakrishna Babu, MLA, Visakhapatnam East, gave a twist that he would promise if Vijayasaireddy comes to the temple .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X