వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ స్కీమ్‌ సూపర్‌- సీఎం ట్వీట్‌ రీట్వీట్‌ చేసిన నీతి ఆయోగ్‌

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా భారత్‌ నెట్‌ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు నాణ్యమైన ఇంటర్నెట్‌ అందించేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు ఫలితాన్ని అందిపుచ్చుకుంటూ పలు ఇతర కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇలా ఏపీలో వైసీపీ సర్కార్‌ అమలు చేస్తున్న కార్యక్రమానికి నీతి ఆయోగ్ ప్రశంసలు లభించాయి.

కొటియా పంచాయతీ- సుప్రీంలో జగన్ సర్కార్ అఫిడవిట్‌- ఒడిశా వివరణకు 4 వారాల గడువుకొటియా పంచాయతీ- సుప్రీంలో జగన్ సర్కార్ అఫిడవిట్‌- ఒడిశా వివరణకు 4 వారాల గడువు

ఏపీలో డిజిటల్‌ లైబ్రరీలతో పాటు నాణ్యమైన ఇంటర్నెట్‌ను ప్రతీ ఒక్కరికీ అందించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరిస్తూ సీఎం జగన్‌ ఓ ట్వీట్‌ చేశారు. ఇందులో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు స్పూర్తితో డిజిటల్‌ పబ్లిక్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రతీ గ్రామంలో నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వర్క్ ఫ్రమ్‌ హోమ్‌ సంస్కృతికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నట్లు సీఎం జగన్ తాజాగా ట్వీట్‌ చేశారు.

niti aayog retweets jagans tweet on implementation of bharat net project in ap

ఏపీలో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు స్ఫూర్తితో చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం జగన్‌ చేసిన ట్వీట్‌పై ఇవాళ తమ ఆరో పాలకమండలి సమావేశం సందర్భంగా నీతి ఆయోగ్ స్పందించింది. జగన్ ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. ఇప్పటికే కేంద్రం చేపడుతున్న పథకాల స్ఫూర్తితో పలు రాష్ట్రాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను నీతి ఆయోగ్‌ ట్వీట్ చేస్తోంది. ఇదే క్రమంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి విషయంలోనూ నీతి ఆయోగ్ సీఎం జగన్‌ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary
niti aayog on today retweets andhra pradesh chief minister ys jagan's tweet on implementation of bharat net project in his own state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X