వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ వర్సెస్ శ్రీ రంగనాథరాజు: తన ఫిర్యాదుపై నో యాక్షన్, మంత్రి పీఏ కంప్లైంట్‌పై మాత్రం వెంటనే..

|
Google Oneindia TeluguNews

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై విరుచుకుపడ్డారు. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని మంత్రి శ్రీ రంగనాథరాజు పీఎస్ ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించారని గుర్తుచేశారు. అదే తాను కంప్లైంట్ చేసి 20 రోజులవుతున్నా అతీ గతీ లేదన్నారు. రాష్ట్రంలో ఎందుకీ పక్షపాతమో అర్థం కావడం లేదన్నారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

20 రోజులవుతున్నా..

20 రోజులవుతున్నా..

తన దిష్టిబొమ్మ దహనం చేశారని, సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేశానని రఘురామ చెప్పారు. 20 రోజులవుతున్నా వారిపై కనీసం ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదున్నారు. కానీ తనపై మాత్రం మంత్రి పీఎస్ కంప్లైంట్ చేసినా వెంటనే కేసు నమోదు చేశారని తెలిపారు. అంతేకాదు తనే మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశానని తప్పుడు కంప్లైంట్ చేశారని తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు కూడా మంత్రి అంటే ఒకలా.. తన ఫిర్యాదుపై మరొలా తీసుకున్నారని ధ్వజమెత్తారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

రఘురామ మంత్రి రంగనాథరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోడూరు పోలీసు స్టేషన్‌లో మంత్రి పీఏ సురేశ్ ఫిర్యాదు చేశారు. ఆ వ్యాఖ్యలు మంత్రి పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని తెలిపారు. ఎంపీ రఘురామపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే సురేశ్ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు అని తెలుస్తోంది. ప్రైవేట్ కేసు అయినందున కోర్టులో తేల్చుకోవాలని సూచించినట్టు విశ్వసనీయ సమాచారం. ఆ వెంటనే రఘురామ కూడా స్పందించారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే

ఏం జరిగిందంటే

రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఆయన ఎంపీ అయ్యారని.. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవీ వచ్చిందని పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీనికి రఘురామ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.

Recommended Video

YSR 71st Birth Anniversary: ప్రజల గుండెల్లో మహానేత, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకుల నివాళి
మాటల యుద్ధం

మాటల యుద్ధం


మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వైసీపీ నేతలు కూడా రఘురామపై ముప్పేట మాటల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రంగనాథరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో మరోసారి చర్చకు దారితీసింది.

English summary
no action about my complaint, but minister pa complaint taken raghurama krishnam raju alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X