వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మ‌హానాడులో వినిపించ‌ని ఏపి ప్ర‌తిప‌క్షం పేరు.. కేంద్ర‌మే టార్గెట్...

|
Google Oneindia TeluguNews

Recommended Video

TDP Mahanadu 2018 : Chandrababu Naidu Speech

అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న మ‌హానాడు లో చంద్ర‌బాబు ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేసార త‌ప్ప ప్ర‌తిప‌క్ష పార్టీ గా వైసీపిని ఎక్క‌డా ప్ర‌స్థావించ‌డం లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో మోదీ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లం చెందినా ప్ర‌శ్నించాల్సిన వైసీపి అదే పార్టీతో చేతులు క‌లిపి తెలుగుదేశం ప్ర‌భుత్వం పైన నింద‌లు మోపే ప్ర‌య‌త్నం చేయ‌డం స‌మంజ‌సం కాదంటోంది టీడిపి. అలాంటి ప్ర‌తిప‌క్షం గురించి మ‌హానాడులో ప్ర‌స్థావించ‌డ‌దం శ‌ద్ద దండ‌గ అంటున్నారు చంద్ర‌బాబు.

కేంద్రంతో చేతులు క‌లిపి కుట్ర‌లు చేస్తున్న వైసిపికి ఎందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి..

కేంద్రంతో చేతులు క‌లిపి కుట్ర‌లు చేస్తున్న వైసిపికి ఎందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి..

తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మ‌హానాడు కార్య‌క్ర‌మంలో నేత‌ల ప్ర‌సంగాల తీరు మారిపోయింది. పార్టీ అదినేత చంద్ర‌బాబు తో స‌హా ముఖ్య‌నేత‌లు కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేసి ప్ర‌సంగింస్తున్నారు. ఏ మంత్రి చూసినా.. ఏ నాయ‌కుడి ప్ర‌సంగం విన్నా కేంద్ర‌ప్ర‌భుత్వాన్ని క‌డిగి పారేస్తున్నారు త‌ప్ప స్థానిక స‌మ‌స్య‌ల గురించి గాని పార్టీ ప‌టిష్ట‌త గురించి గాని స్పందించ‌డం లేదు. ముఖ్యంగా చంద్ర‌బాబు రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ఉంద‌న్న‌ట్టు కూడా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ప్ర‌తిప‌క్షం ప్ర‌శ్నిస్తుంది స‌మాధానం చెప్పాల‌నే ఆలోచ‌న కూడా చంద్ర‌బాబు చేయ‌డం లేదు. అస‌లుఏపీలో ప్ర‌తిప‌క్షం గురించి చంద్ర‌బాబు నాయుడు కించిత్ బాద కూడా ప‌డ‌డం లేద‌ని మ‌హానాడు వేదిక‌లు రుజువు చేస్తున్నాయి.

 స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌కుండా.. కేంద్రంతో చేతులు క‌లుపుతారా...??

స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌కుండా.. కేంద్రంతో చేతులు క‌లుపుతారా...??

2014 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో వైయ‌స్ ఆర్ సీపి త‌రుపున‌ ఆంద్ర‌ప్ర‌దేశ్ లో 67 మంది అభ్య‌ర్థులు గెలుపొంది బ‌లమైన ప్ర‌తిప‌క్ష పార్టీగా అవ‌త‌రించింది. దీంలో శాస‌న స‌భ స‌మావేశాలు కూడా వాడి వేడిగా జ‌రిగేవి. ప్ర‌ధానంగా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ల మ‌ద్య మాట‌ల యుద్దం న‌డిచేది. రాష్ట్ర అభివ్రుద్ది, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు, ప్రాజెక్టుల నిర్మాణం, విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హోదా, రాజ‌దాని నిర్మాణం త‌దిత‌ర అంశాల ప‌ట్ల అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నేత‌గా జ‌గ‌న్ చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఎండ‌గ‌డుతుండే వారు. జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు కొన్ని సంద‌ర్బాల్లో చంద్ర‌బాబు స‌మాధానం చెప్పడానికి ఇబ్బందులు ప‌డుతుండేవారు. అంత‌టి బ‌ల‌మైన ప్ర‌తిప‌క్ష పార్టీ ఉన్న వైసీపి రాను రాను బ‌ల‌హీన ప‌డిన‌ట్టుగా చిత్రీక‌రించింది తెలుగుదేశం పార్టీ. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తిప‌క్ష పార్టీకి ఇవ్వాల్సి ప్రాధాన్య‌త‌ను కూడా క్ర‌మంగా త‌గ్గిస్తూ వ‌స్తున్నారు చంద్ర‌బాబు. అసెంబ్లీ స‌మావేశాల‌కు కూడా హాజ‌రుకాని , ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌ట్టించుకోని ప్రతిప‌క్ష పార్టీకి ఎందుకు స‌మాధానం చెప్పాల‌ని బాబు నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. అస‌లు ప్ర‌తిప‌క్ష పార్టీగా వైసీపికి అందివ్వాల్సిన స‌మాచారాన్ని కూడా నిర‌క‌రిస్తున్నారు. మ‌హానాడు వేదిక నుండి కూడా ప్ర‌తిప‌క్షం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను, ప‌థ‌కాల అమ‌లులో అడ్డం ప‌డుతున్న విధానాల‌ను చ‌ర్చించ‌డానికి నిరాక‌రిస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా పూర్తిగా విఫ‌లం చెందిన పార్టీ వైసీపి..

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష పార్టీగా పూర్తిగా విఫ‌లం చెందిన పార్టీ వైసీపి..

చంద్ర‌బాబు ద్రుష్టంతా కేంద్ర ప్ర‌భుత్వ విధానాలు, అందుకు జ‌గ‌న్ స‌హ‌క‌రిస్తున్న తీరుపైనే కేంద్రీక‌రించారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల నుండి బ‌య‌ట‌ప‌డేందుకు స‌హ‌క‌రించాల్సింది పోయి కేంద్రంతో చేయి క‌లిపి రాష్ట్రాన్ని మ‌రింత అదఃపాతాళానికి నెట్టేస్తారా అంటూ మండిప‌డుతున్నారు చంద్ర‌బాబు. మ‌హానాడు వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు త‌ప్ప స్థానిక ప్ర‌తిప‌క్ష పార్టీని అస్స‌లు ప‌ట్టంచుకోండం లేదు చంద్ర‌బాబు. విభ‌జ‌న చ‌ట్టంలో పొందు ప‌రిచిన హామీల‌ను అమ‌లు చేయ‌డంలో కేంద్ర పై చేస్తున్న పోరాటానికి స‌హ‌క‌రించ‌కుండా త‌మ‌నే నిందిస్తారా అంటూ వైసీపి పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు చంద్ర‌బాబు. అలాంటి పార్టీ గురించి, అలాంటి నేత‌ల గురించి మ‌హానాడులో చర్చించాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు చంద్ర‌బాబు. పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్బంగా వైసీపి ఎంపీలు ఆడిన నాట‌కం కూడా చంద్ర‌బాబుకు రుచించ‌లేదు. ఏపీ ఎంపీలుగా మోడీని నిల‌దీయాల్సిన నాయ‌కులు మోదీకి మోక‌రిల్లి ప్ర‌ణామాలు చేస్తున్నార‌ని. ఇలా ప్ర‌వ‌ర్తిస్తే కేంద్రం ఎందుకు దిగివ‌స్తుంద‌ని బాబు ప్ర‌తిప‌క్షాన్ని నిల‌దీసారు.

ద్వంద్వ వైఖ‌రి అవ‌లంభిస్తున్న వైసీపి గురించి చ‌ర్చ అన‌వ‌స‌రం..

ద్వంద్వ వైఖ‌రి అవ‌లంభిస్తున్న వైసీపి గురించి చ‌ర్చ అన‌వ‌స‌రం..

ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రంగాని, ఆవశ్య‌క‌త గాని తెలుగుదేశం ప్ర‌భుత్వానికి చెప్పుకొస్తున్నారు చంద్ర‌బాబు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌తిప‌క్ష పార్టీ పేరును సంభోదించ‌డానికి కూడా టీడిపి నేత‌లు సాహ‌సించ‌డం లేదు. మ‌హానాడులో చంద్ర‌బాబుతో స‌హా ప్ర‌తి నేత బాణాల‌ను ఎక్కు పెట్టి కేంద్రానికి సంధిస్తున్నారు త‌ప్ప ప్ర‌తిప‌క్ష పార్టీ పైన కాద‌నే అంశం స్ప‌ష్ట‌మ‌వుతోంది. లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోకుండా క‌క్ష్య పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్న బీజెపి ప్ర‌భుత్వాన్ని అన్ని విధాలా విమ‌ర్శిస్తున్నారు త‌ప్ప రాష్ట్రానికి వ‌సంబందించిన ప్ర‌తిపక్ష పార్టీ గురించి చంద్ర బాబు ఏ మాత్రం బాద‌ప‌డ‌టం లేదు. మ‌హానాడు వేదిక‌గా మొద‌టి రోజు ఏపి ప‌ట్ల మోడి, కేంద్ర ప్ర‌భుత్వ విధానాలను ఎండ‌గ‌ట్టిన బాబు., రెండ‌వ రోజు అమిత్ షా మీద విరుచుకు ప‌డ్డారు. రాష్ట్రానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో ప్ర‌తి పైసాకు లెక్కుంద‌ని బాబు వివ‌ర‌ణ ఇచ్చారు. అమీత్ షా ఇక‌నైనా వాస్త‌వ‌ప‌రిస్తితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే మంచిద‌ని హెచ్చ‌రించారు.

English summary
telugudesham party national president chandrababu naidu fired on central government instead of local opposition ycp party . chandra babu alleged that jagan mixed hands with central bjp government and playing dual role in state. thats why no need to remember him in the mahanadu dyes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X