వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి,పవన్‌కు బాబు కౌంటర్: మీ పొత్తుతో ఓట్లు, సీట్లు తగ్గాయి, నన్ను దెబ్బతీసే ప్లాన్, భయపడను

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: తనను దెబ్బతీసేందుకు రాజకీయ ఎత్తుగడలకు పాల్పడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.బిజెపి, జనసేనతో పొత్తుతో 2014 ఎన్నికల్లో తక్కువ ఓట్లు, సీట్లు వచ్చాయని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.వైసీపీ తమ గుప్పిట్లో ఉంటుందని బిజెపి భావిస్తోందేమోనని చంద్రబాబునాయుడు చురకలు అంటించారు.తాను ఎవరికీ భయడనని చంద్రబాబునాయుడు చెప్పారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బిజెపి నేతలకు చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు.

ఏపీ శాసనమండలిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం నాడు ప్రసంగించారు. ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.

వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రితో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశంపై ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని బాబు చెప్పారు.

రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర

రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర

ఏపీ రాష్ట్రంలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరోక్షంగా బిజెపిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఇస్తోందనే ప్రచారం సాగుతోందని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. బిజెపితో కలిసి పొత్తులో ఉన్న టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాజకీయంగా తమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఆ ఆటలను సాగనివ్వమోనని చంద్రబాబునాయుడు చెప్పారు. తమిళనాడు రాష్ట్రంలో నడుపుతున్నట్టుగా ఏపీ రాష్ట్రంలో కూడ తన ప్లాన్‌ను అమలు చేసేందుకు బిజెపి ప్లాన్ చేస్తోందని పరోక్షంగా బాబు విమర్శలు గుప్పించారు.

వైసీపీ మీ గుప్పిట్లో ఉంటుంది

వైసీపీ మీ గుప్పిట్లో ఉంటుంది

ఎన్డీఏ ప్రభుత్వంతో తాము మిత్రపక్షంగా ఉన్న సమయంలోనే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ బిజెపికి మద్దతుగా నిలిచిన విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. కేసులున్న వైసీపీ నేతలు తమ చెప్పు చేతల్లో ఉంటారని బిజెపి నేతలు విశ్వసిస్తున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతివారం కోర్టుకు హజరయ్యే వైసీపీ నేతలు ప్రధానమంత్రిని కలిస్తే ఏ రకమైన సంకేతాలు వెళ్తున్నాయని బాబు ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంఓలో ఉన్న సమయంలో చోటు చేసుకొన్న పరిణామాలపై దినపత్రికలో వచ్చిన వార్తను బాబు చదివి విన్పించారు.

బిజెపి, జనసేనతో పొత్తుతో సీట్లు తగ్గాయి

బిజెపి, జనసేనతో పొత్తుతో సీట్లు తగ్గాయి

బిజెపి, జనసేనతో పొత్తు కారణంగా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు, సీట్టు తగ్గాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 48 శాతం ఓట్లు వచ్చాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. కానీ, 2014 ఎన్నికల్లో బిజెపి, జనసేనతో పొత్తు కారణంగా తమకు కేవలం 46 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని చంద్రబాబునాయుడు లెక్కలను చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం ప్రకారంగా తమకు 120 సీట్లు వస్తాయని , ఆ ఓట్ల శాతం ప్రకారం వైసీపీకి 45 సీట్లు వస్తాయని మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. కానీ, పొత్తుల కారణంగా టిడిపి, బిజెపి కూటమికి 106 సీట్లు వచ్చాయని బాబు గుర్తు చేశారు.

పవన్‌కు నేను అవినీతిపరుడిగా కన్పిస్తున్నా

పవన్‌కు నేను అవినీతిపరుడిగా కన్పిస్తున్నా

పవన్ కళ్యాణ్‌కు నాలుగేళ్ళ తర్వాత నేను అవినీతి పరుడిగా కన్పిస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.ఇసుక, ఎర్ర చందనం విషయంలో తనపై విమర్శలు చేశారని బాబు గుర్తు చేశారు. ఇసుకను పారదర్శకంగా ప్రజలకు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒకేసారి పవన్ కళ్యాణ్ ఎందుకు యూ టర్న్ తీసుకొన్నారో చెప్పాలని బాబు ప్రశ్నించారు. జెఎఫ్‌సిని ఏర్పాటు చేసి కేంద్రం నుండి 75వేల కోట్టు ఇవ్వాలని నిర్ధారించారు. కానీ, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశాన్ని సభలో ప్రసంగించలేదన్నారు.బిజెపి నేతలు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతున్నట్టుగా ఓ పత్రికలో వచ్చిన వార్తను చంద్రబాబునాయుడు సభలో చదివి విన్పించారు. ఎర్రచందనం స్మగర్లను అరికట్టేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. వపన్ కళ్యాణ్ దీక్ష చేస్తే ప్రత్యేక హోదా ఇస్తారా అంటూ బిజెపి నేతలను ప్రశ్నించారు.

ఏపీకి బిజెపి అన్యాయం చేసింది

ఏపీకి బిజెపి అన్యాయం చేసింది

ఏపీ రాష్ట్రానికి బిజెపి అన్యాయం చేసిందని ఏపీ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేయకూడదనే అభిప్రాయం బిజెపి నేతలకు ఉందా అని బాబు ప్రశ్నించారు. ఒక వేళ రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తే ఏపీ రాష్ట్రం తాను బలపడుతానని బిజెపి నేతలు భావిస్తున్నారా అని బాబు ప్రశ్నించారు.

భయపడేది లేదు

భయపడేది లేదు

తాను ఎవరికీ భయపడేది లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. తనపై కేసులున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాబు చెప్పారు. తనపై ఏ ఒక్క కేసు కూడ లేదని బాబు గుర్తు చేశారు. గతంలో తనపై సుమారు 26 విచారణ కమిషన్‌లు ఏర్పాటు చేసినా కానీ, ఏ ఒక్క అంశాన్ని కూడ నిరూపించలేదని బాబు గుర్తు చేశారు. తనపై వైసీపీ నాయకులు హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులను కోర్టులు కొట్టివేసిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

English summary
Ap chief minister Chandrababu Naidu said that TDP was lost seats and votes with alliance of Bjp and Janasena in 2014 elections. Tdp was lost above 1 percent votes in 2014 elections he said. chandrababunaidu addressed in legislative council on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X