వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశైలం-సాగర్‌లో లాంచి ప్రయాణాలు రద్దు..! వరుస ప్రమాదాలతో భయపడుతున్న పర్యాటకులు!

|
Google Oneindia TeluguNews

నాగార్జునసాగర్‌/హైదరాబాద్: సరదాగా సెలవుల్లో బోటు షికారుకు వెళ్దామనుకునే పర్యాటకులకు ఇది చేదు వార్త. గత నెలలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం ఎలాంటి పడవ ప్రయాణాలు ఉండవని, అన్ని లాంచి రూట్లను మూసివేస్తున్నట్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

నదీ పరివాహక ప్రాంతంలో సెలవులను ఆస్వాదించాలనుకునే పర్యటకులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అధికారులు అనధికారికంగా సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రజలు కూడా బోటు ప్రయాణాల పట్ల జంకుతున్నట్టు చర్చ జరుగుతోంది. 2017లో కృష్ణా నది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడటం, ఆ తర్వాత గోదావరిలో పడవ బోల్తాపడడంతో పర్యాటకులు చాలా వరకు భయపడుతున్నట్టు తెలుస్తోంది.

NO Boat travell in Sri Sailam to Nagarjuna Sagar..!!

బోటు ప్రమాదాలు పర్యాటక శాఖకు గండికొడుతున్నాయి. ప్రజలు కూడా బోటు ప్రయాణాల పట్ల తీవ్రంగా భయపడిపోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గోదావరి కచ్చులూరు బోటు ప్రమాద ఘటన నేపథ్యంలో నాగార్జునసాగర్‌- శ్రీశైలం వరకు ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న లాంచీ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు లాంచీ స్టేషన్‌ మేనేజర్‌ హరి బాబు తెలిపారు. అయితే, పర్యాటకుల భద్రత దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

అయితే రెండు నెలలుగా లాంచీలు అంతగా నడవలేదని తెలుస్తోంది. మూడు రోజుల నుంచి జలాశయంలో లాంచీలు, జాలీ ట్రిప్పులు నడుపుతున్నారు. దీంతో 23 నుంచి సాగర్‌-శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది. కాగా, ట్రిప్పుకు సరిపడా పర్యాటకులు రిజర్వేషన్‌ చేసుకోకపోవడంతో సాగర్‌-శ్రీశైలం ట్రిప్పును రద్దు చేసినట్లు మేనేజర్‌ హరిబాబు తెలిపారు. ఆర్ధికంగా పర్యాటక రంగానికి ఇలాంటి పరిణామాలు శరాఘాతంగా మారుతున్నాయని ఆయన తెలిపారు.

English summary
In the wake of the Godavari Kachuluru boat accident, a launchpad, which starts from 23rd of this month till Nagarjunasagar-Srisailam, has been abolished, "Lancashire station manager Hari Babu said. However, the decision to keep the safety of tourists in mind was taken.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X