వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు డిమాండ్ కు ఈసీ నో : బ్యాలెట్ ప‌ద్ద‌తిలో ఎన్నిక‌లు సాధ్యం కాదు..

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Elections 2019 : EC Clarified That Ballot Paper Election Is Not Possible In Place Of EVMs

దేశంలో ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ ప‌ద్ద‌తి లో నిర్వ‌హించ‌టం సాధ్యం కాద‌ని కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ సునీల్ ఆరోరా స్ప‌ష్టం చేసారు. అనుకూల ఫ‌లితం వ‌స్తే స‌రేన‌ని..వ్య‌తిరేక ఫ‌లితం వ‌స్తే ఈవీఎంల పై నెపం వేయ‌టం స‌రికాద‌న్నారు. తాజాగా ఏపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ ప‌ద్ద‌తిన ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని..ఇందు కోసం అన్ని పార్టీల‌తో క‌లిసి పోరాటం చేస్తామ‌ని చెప్పారు. ఇప్పుడు సీఈసీ ప్ర‌క‌ట‌నతో చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది చూడాలి..

ప్ర‌స్తుతం ఎన్నిక‌లు నిర్వ‌హిస్తున్న ఈవీఎం ల స్థానంలో బ్యాలెట్ పేప‌ర్లు తేవాల‌నే డిమాండ పై ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి సీరియ‌స్‌గానే స్పందించారు. బ్యాలెట్ ప‌ద్ద‌తిలో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. ఈవీఎం ల‌ను ట్యాం ప‌రింగ్ చేయ‌టం సాధ్యం కాద‌న్నారు. ఈవీఎంల‌ను రాజ‌కీయ పార్టీలు ఫుట్‌బాల్ మాదిరిగా భావించ‌టం భాదించింద‌ని పేర్కొన్నారు. ఈవీఎం లో త‌లెత్తే లోపాల‌ను తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో బాగా త‌గ్గించామ‌ని వివ‌రించారు. ఈవీయం ల ట్యాంప‌రింగ్..లోపం వేర్వేరు అంశాలుగా గుర్తించాల‌ని సూచించారు.

No chanace for Ballot election : CEC clarified parties

ఈవీఎంలు కేవ‌లం రికార్డు చేసే యంత్రాలేన‌ని .. వాటిని ప్రోగ్రామింగ్ చేయ‌లేమ‌ని తేల్చి చెప్పారు. అనుకూలమైన ఫ‌లితం వస్తే స‌రేన‌ని..ప్ర‌తికూలంగా వ‌స్తే ఈవీఎంల పై నెపం వేయ‌టం స‌రికాద‌న్నార ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ సునీల్ ఆరోరా. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత తెలంగా ణ కాంగ్రెస్ నేత‌లు ప్రధానంగా ఈవీఎం ల ప‌నీతీరు పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా, టిడిపి అధినేత చంద్ర‌బాబు సైతం ఈవీఎం ల ద్వారా ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌టం లేద‌నే అభిప్రాయం ఉంద‌ని..వీటి స్థానంలో బ్యాలెట్ పేప‌ర్ల‌ను వినియోగించాల‌ని డిమాండ్ చేసారు. ఈవీఎం లు ప్ర‌జాస్వామ్యం లో స‌రి కాద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేసారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేప‌ర్ల కోసం అన్ని రాజ‌కీయ పార్టీల‌తో క‌లిసి పోరాటం చేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఎట్టి ప‌రిస్థితుల్ల‌నూ బ్యాలెట్ పేప‌ర్ల తో ఎన్నిక‌లు సాధ్యం కాద‌ని తేల్చి చెప్పారు. మ‌రి..చంద్రబాబు ఈ విష‌యంలో ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి..

English summary
Chief Election Commissioner clarified that ballot paper election is not possible in place of EVMs. CEC stated Political parties playing foot ball.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X