వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని తరలింపుపై బోత్స అధికారిక సమాధానం

|
Google Oneindia TeluguNews

ఏపీ రాజధాని, అమరావతి నుండి ఎక్కడికి తరలించడం లేదని రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బోత్స సత్యనారయణ అధికారింగా సమాధానం ఇచ్చారు. మండలి సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్సీ లేవనెత్తిన ప్రశ్నకు బోత్స రాతపూర్వ సమాధానం చెప్పారు. అమరావతి నుండి రాజధాని తరలిపోతుందా... అయితే ఇప్పటివరకు దానిపై పెట్టిన ఖర్చులు ఏంత...? అంటూ టీడీపీ సభ్యురాలు శమంతకమణి వేసిన ప్రశ్నకు మంత్రి బోత్స సత్యనారాయణ ఈ సమాధానం చెప్పారు.

 ఏపీ రాజధాని అమరావతిపై స్పష్టత ఇచ్చిన బోత్స

ఏపీ రాజధాని అమరావతిపై స్పష్టత ఇచ్చిన బోత్స

అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలిపోతుందని, ఇందుకోసం త్వరలో ప్రభుత్వం ఓ ప్రకటన కూడ చేస్తుందని గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు అధికార పార్టీ నాయకులు రోజుకో ప్రకటన చేస్తుండడంతో టీడీపీ, అధికార పార్టీ వైసీపీ సభ్యుల మధ్య వాదనలు కూడ కొనసాగుతున్నాయి. . ఈనేపథ్యంలోనే రాజధాని తరలిపోనుందా... లేదా.. అనే ఉత్కంఠ ప్రజల్లో కొనసాగుతోంది. అయితే రాజధాని తరలింపుపై బయట అనధికారికంగా జరుగుతున్న ప్రచారానికి ప్రభుత్వం అధికారికంగా ఫుల్‌స్టాప్ పెట్టింది. రాజధాని ఎక్కడికి తరలి వెళ్లడం లేదని మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బోత్స రాతపూర్వక సమాధానం మంత్రి ఇచ్చారు.

రాజధానిపై చర్చ లేవదీసిన బోత్స

రాజధానిపై చర్చ లేవదీసిన బోత్స


ముఖ్యంగా రాజధాని మార్పు, ఏర్పాట్లపై మంత్రి బోత్స సత్యనారాయణ అనేక సార్లు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే... రాజధాని శ్మశానంగా మారిందని అంటూ...చర్చకు లేవదీశారు. దీనిపై కమీటి వేశామని, అందులో అనేక అక్రమాలు జరిగాయని, రాజధాని పేరుతో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారంటూ ఇతర మంత్రులు సైతం పలు విమర్శలు చేశారు. దీంతో పాటు పలు కట్టడాలకు కూడ ప్రభుత్వం బ్రేకులు వేసింది. ఈనేపథ్యంలోనే రాజధాని మార్పు అంశంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

చర్చకు లేవదీసీన మంత్రే సమాధానం

చర్చకు లేవదీసీన మంత్రే సమాధానం

అయితే రాజధానిపై చర్చకు తెరలేపిన మంత్రి బోత్స సత్యనారాయణే తిరిగి అదే ప్రశ్నకు అధికార సమాధానం చెప్పడం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యానికి ఓ ఫుల్‌స్టాప్ పడిందా లేక సమాధానం కోసమే సభలో ప్రస్తావించారా అనే విషయాలు తేలాల్సి ఉంది. కాగా ఇటివలే రాజధాని నిర్మాణం కోసమే తీసుకున్న సుమారు 2500 ఎకరాల భూముల పై మంత్రిమండలి ఓ తీర్మాణాన్ని అంగీకరించింది. ఆ అసైన్డ్ భూములపై రైతులకే అధికారం ఉంటుందని కూడ మంత్రివర్గం తీర్మాణించింది. దీంతో అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం ఏమేరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

English summary
there is no moving the capital from Amravati,State Municipal Minister Botsha Satyanarayana officially replied in ap council
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X