విషాదం: పెళ్లై ఐదేళ్లు, పిల్లలు లేరని మనస్తాపంతో ఉరివేసుకున్నాడు
అమరావతి: పెళ్లి అయి ఐదేళ్లయింది. పిల్లలు పుట్టలేదు. బంధువులు, స్నేహితుల దెప్పి పొడుపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గుడిబండ మండలంలోని హెచగొల్లహట్టి గ్రామానికి చెందిన చిక్కన్న(28) సంతానం లేదనే మనస్తాపంతో ఉరివేసుకున్నట్లు ఎస్‌ఐ ఖాజాహుస్సేన్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే... చిక్కన్నకు అదే గ్రామానికి చెందిన కవితతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన మూడేళ్ల వరకు వీరి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతూ వస్తోంది. అయితే పెళ్లి అయిన ఐదేళ్లు గడిచినా సంతానం కలగకపోవడంతో చిక్కన్న జీవితంపై విరక్తి చెందాడు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి కుటుంబ సభ్యులకు చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అతిని కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఇంతలో ఆదివారం గొర్రెలు కాపర్లు గ్రామ సమీపంలోని కానుగ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

దీంతో భార్య కవిత, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కిందపడి పాలిటెక్నిక్ విద్యార్ధి ఆత్మహత్య
రైలు కింద పడి ఓ పాలిటెక్నిక్ విదార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన జిల్లాలోని పామిడిలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుత్తి జీఆర్పీ ఎస్సై అజయ్‌కుమార్ వివరాలు వెళ్లడించారు. పామిడిలోని ఎద్దులపల్లిరోడ్డులో నివాసముంటున్న రామాంజనేయులు రెండో కుమారుడు పవన్‌కుమార్ అనంతపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
అతడు గత కొన్నాళ్లుగా కడుపునొప్పితో బాధపడుతుండేవాు. ఈ క్రమంలో నొప్పి అధికం కావడంతో గుత్తి, బెంగళూరు రైలు ట్రాక్ 240 మైలు రాయి సమీపాన ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే రైల్వే ఉద్యోగి మృతదేహాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
తలనొప్పి తీవ్రకావడంతో భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications