వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినీ తారలు చేరినా బయటకే...: టిడిపిలో చేరి జయసుధ తప్పు చేశారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరిన సినీ తారలు కొంత కాలం ఓ వెలుగు వెలిగి తర్వాత బయటకు వెళ్లారు. జయప్రద, రోజా తొలుత తెలుగుదేశం పార్టీలో చేరినా ఆ తర్వాత ఆ పార్టీలో ఇమడలేక బయటకు వెళ్లిపోయారు. జయసుధ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెసుతో ప్రారంభించినప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరారు. జయప్రద, రోజా అనుభవాల తర్వాత కూడా ఆమె టిడిపిలో చేరి రాజకీయంగా తప్పు చేశారా అనే ప్రశ్న రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తోంది.

ఇప్పటికే సినీ తార కవితను టిడిపి నాయకత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అటువంటి స్థితిలో జయసుధకు పార్టీలో కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారా అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. నిజానికి జయసుధలో దూకుడు తక్కువ. ఆమెతో పోలిస్తే జయప్రద, అంతకన్నా రోజా దూకుడుగా వ్యవహరిస్తారు. టిడిపిలో ఉన్నప్పుడు కూడా వారు దూకుడుగానే వ్యవహరించారు.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జయసుధ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయింది. ఎన్నికల ముగిసిన అనంతరం కొన్నాళ్లకే ఆమె, అధికార పార్టీ తెరాసలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, జయసుధను బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. జయసుధ కూడా పార్టీ అగ్రనేతల హామీ మేరకు పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపారు.

No Cine star able to continue in TDP: jayasudaha made a mistake?

అయితే గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నాయకత్వం తనని నిర్లక్ష్యం చేస్తోందని భావించిన జయసుధ, తన వ్యతిరేకులకు కార్పొరేటర్ టికెట్లిచ్చే సరికి, ఉన్న ట్టుండి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా విజయవాడకు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి చర్చించి, టీడీపీలో చేరిపోయారు.
తెలుగుమహిళా అధ్యక్షురాలుగా కొనసాగిన సినీనటి రోజా పార్టీకి గుడ్‌బై చెప్పిన తరువాత కవితకు మంచిరోజులు వస్తాయని పార్టీలో అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. పార్టీ నాయకత్వం కవితను ప్రచారానికి మాత్రమే వాడుకుందనే విమర్శలు ఉన్నాయి.

ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో నాయకత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే, కవితను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేసిందనే భావన ఉంది. యువనేత లోకేష్ అయితే కవితకు సమయం ఇవ్వడమే వృధా అన్నట్లుగా వ్యవహరి స్తుంటారని చెబుతున్నారు. గత పదేళ్లుగా పార్టీ కోసం తన పనిచేస్తున్న కవితను కాదని జయసుధకు పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇస్తుందా అనేది ప్రశ్నే. కవితతో పోలిస్తే జయసుధకు మాజీ ఎమ్మెల్యే అనే అర్హత అదనంగా ఉంది.

English summary
According to political analysts- ex MLA and actress Jayasudha made a mistake joining in Telugu Desam Party (TDP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X