హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బోట్‌లో కెటిఆర్: విజేతలకి బహుమతి, ముద్దు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌ను సుందరమైన సరస్సుగా తీర్చిదిద్దడంతోపాటు పడవ పందాలను ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఆదివారం సంజీవయ్య పార్కులో మాన్‌సూన్ రెగెట్ట ముంపు సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ పోటీల్లో ఆప్టిమిస్ట్ విభాగంలో లీలాసాగర్ స్వర్ణం సాధించగా, మరో హైదరాబాద్ సెయిలర్ రిషబ్ నాయర్ రజతం గెలుచుకున్నాడు. లీలాసాగర్ 16 పాయింట్లతో ముందంజలో నిలవగా, రిషబ్ నాయర్ 30పాయింట్లతో ద్వితీయ, విశాల్ సింగ్ 38 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. పాపులర్ ఫ్యామిలీ ఛాంపియన్ షిప్‌లో 16 రేసులు నిర్వహించగా ముంబై నుంచి నాలుగు జట్లు పోటీపడ్డాయి.

విజేతలైన లీలా సాగర్, రిషబ్ నాయర్, విశాల్ సింగ్, గౌరవ్ షిండేలకు మంత్రి కెటిఆర్ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపి కె విశ్వేశరరెడ్డి మాట్లాడుతూ.. హుస్సేన్‌సాగర్‌లో జాతీయ స్థాయి పడవ పందాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పరిశ్రమలు హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థ రసాయనాలను వదల వద్దన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ యాటింగ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుయిమ్ షేక్ మాట్లాడుతూ.. లీలాసాగర్, రిషబ్ నాయర్‌లకు మంచి భవిష్యత్ ఉందన్నారు. త్వరలోనే వాళ్లిద్దరూ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశాన్ని సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో డెలాయిట్ ఛైర్మన్ పిఆర్ రమేష్ పాల్గొన్నారు.

మాన్‌సూన్ రెగెట్టా

మాన్‌సూన్ రెగెట్టా

హుస్సేన్‌సాగర్‌ను సుందరమైన సరస్సుగా తీర్చిదిద్దడంతోపాటు పడవ పందాలను ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ మంత్రి కె తారక రామారావు అన్నారు.

సరదాగా బోట్‌లో...

సరదాగా బోట్‌లో...

హుస్సేన్‌సాగర్‌లో బోట్‌లో ప్రయాణిస్తున్న రాష్ట్ర మంత్రి కె తారక రామారావు, ఎంపి విశ్వేశ్వరరెడ్డి.

కెటిఆర్ మాట్లాడుతూ..

కెటిఆర్ మాట్లాడుతూ..

ఆదివారం సంజీవయ్య పార్కులో మాన్‌సూన్ రెగెట్ట ముంపు సందర్భంగా విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి కెటిఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

ఈ పోటీల్లో ఆప్టిమిస్ట్ విభాగంలో లీలాసాగర్ స్వర్ణం సాధించగా, మరో హైదరాబాద్ సెయిలర్ రిషబ్ నాయర్ రజతం గెలుచుకున్నాడు.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

లీలాసాగర్ 16 పాయింట్లతో ముందంజలో నిలవగా, రిషబ్ నాయర్ 30పాయింట్లతో ద్వితీయ, విశాల్ సింగ్ 38 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

పాపులర్ ఫ్యామిలీ ఛాంపియన్ షిప్‌లో 16 రేసులు నిర్వహించగా ముంబై నుంచి నాలుగు జట్లు పోటీపడ్డాయి.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

విజేతలైన లీలా సాగర్, రిషబ్ నాయర్, విశాల్ సింగ్, గౌరవ్ షిండేలకు మంత్రి కెటిఆర్ బహుమతులను ప్రదానం చేశారు.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపి కె విశ్వేశరరెడ్డి మాట్లాడుతూ.. హుస్సేన్‌సాగర్‌లో జాతీయ స్థాయి పడవ పందాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

విజేతకు బహుమతి

విజేతకు బహుమతి

పరిశ్రమలు హుస్సేన్‌సాగర్‌లో వ్యర్థ రసాయనాలను వదల వద్దని ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

విజేతకు ముద్దు

విజేతకు ముద్దు

ఈ సందర్భంగా హైదరాబాద్ యాటింగ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుయిమ్ షేక్ మాట్లాడుతూ.. లీలాసాగర్, రిషబ్ నాయర్‌లకు మంచి భవిష్యత్ ఉందన్నారు.

బహుమతిని కొరుకుతూ..

బహుమతిని కొరుకుతూ..

త్వరలోనే వాళ్లిద్దరూ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశాన్ని సాధిస్తారని కోచ్ షేక్ అన్నారు. ఈ కార్యక్రమంలో డెలాయిట్ ఛైర్మన్ పిఆర్ రమేష్ పాల్గొన్నారు.

విజేతలతో...

విజేతలతో...

విజేతలైన లీలా సాగర్, రిషబ్ నాయర్, విశాల్ సింగ్, గౌరవ్ షిండేలకు మంత్రి కెటిఆర్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి విశ్వేశ్వర్ రెడ్డితోపాటు డెలాయిట్ ఛైర్మన్ పిఆర్ రమేష్, హైదరాబాద్ యాటింగ్ క్లబ్ అధ్యక్షుడు, కోచ్ సుయిమ్ షేక్ పాల్గొన్నారు.

English summary
Mr. K.T. Rama Rao, Minister of IT, Govt of Telangana on Sunday said that Hussain Sagar is the picturesque lake in the heart of Hyderabad City. And they will speed up the cleaning process. They must save this lake from destruction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X