వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ని సీట్లు వస్తాయని ఇప్పుడే చెప్పను : పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

మరో కొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో పోటీ చేసిన ఆయా పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మాకు ఇన్ని సీట్లు వస్తాయంటే మాకు అన్ని సీట్లు వస్తాయని బహింరంగానే చెబుతున్నారు. కాని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటిచేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం వాటి గురించి ఇప్పుడు మాట్లడనని తేల్చి చెప్పారు.

కాకాపోతే ప్రస్థుత ఎన్నికలు రాష్ట్ర్రంలో మార్పుకు నాంది పలుకుతాయని చెప్పారు. ఇందులో పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తోంది. ఆయన పోటి చేసిన రెండు స్థానాల్లో ఎంత మెజారీటి వస్తుందని మాత్రం తాను మాట్లాడబోనని స్పష్టం చేశారు. కాగా ఈవీఎంల విషయంలో వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కింపులను పెంచాలని తమ పార్టీ కూడ కోరుకుంటుందని అన్నారు. అయితే స్లిప్పులను ఎంత శాతం లెక్కించాలనేది నిపుణులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఇటివల మృతి చెందిన ఎస్పివై రెడ్డి కుటంబాన్ని ఆయన పరామర్శించిన అనంతరం మీడీయాతో మాట్లాడారు.

no comments on elections result: pawan kalyan

కాగా పవన్ కళ్యాణ్ అటు పశ్చిమ గోదావరి జిల్లా బీమవరం తోపాటు విశాఖ జిల్లా గాజువాక నుండి ఆయన పోటి చేశారు. దీంతో అయన ఎక్కడ గెలుస్తాడు ,రెండు చోట్ల గెలుపు సాధ్యమవుతుందా అనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. దీనికి తోడు జనసేన నేతల్లో ఎన్నికలకు ముందు ఉన్న ఊపు ఎన్నికల అనంతరం కనిపించడం లేదు. అటు అధికార తెలుగుదేశం ఇటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ లు తమకు ఇన్ని సీట్లు వస్తాయని చెబుతున్నా..జనసేన మాత్రం ఎక్కడా తమకు వచ్చే సీట్ల సంఖ్యను చెప్పడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ కు ఉన్న అంచనాలు ఎమీటీ ,అయన ఫలితాలపై ఏమనుకుంటున్నాడనే ఉత్కంఠ ఏపి ప్రజల్లో ఉంది.

English summary
I Will not talk about elections result says Jana Sena Party chief Pawan Kalyan, but the drastic change has come into ploitics by thethis election
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X