• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రజాధనం వినియోగంలో ఇంగితజ్ఞానం లేదు.. అంతా రాచరికంలా మారిందన్న జేపీ

|
  ప్రజాధనం విలాసాలకు వాడుతున్నారని మండిపడ్డ జేపీ!! | Jayaprakash Narayan Criticizes KCR And YS Jagan!!

  తెలుగు రాష్ట్రాల పాలన రాచరిక పాలన తలపిస్తుంది అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రజా దానం దుర్వినియోగం చెయ్యటంలో ఎలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు ముందు వరసలో ఉన్నారని ఆయన మండిపడ్డారు . ఒక్క రాష్ట్రాలోనే కాదు దేశంలో కూడా పాలన రాచరిక స్వభావంతోనే సాగుతుందని ఆయన అన్నారు.

   ప్రజా ధనం విలాసాలకు వాడుతున్నారని మండిపడిన లోక్ సత్తా అధినేత జేపీ

  ప్రజా ధనం విలాసాలకు వాడుతున్నారని మండిపడిన లోక్ సత్తా అధినేత జేపీ

  ‘లోక్ సత్తా' అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రజాధనాన్ని చాలా పవిత్రంగా చూడాలని అన్నారు. కానీ దేశంలో అలా చూసే పద్ధతి రాజకీయ వర్గాల్లో కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రజా ధనం విలాసాలకు వాడుతున్నారని , ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు విలాసవంతమైన భవనాలు కట్టుకుంటున్నారు అని , అదంతా ప్రజా దానం అని మర్చిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ దేశంలో నిరుపేద కుటుంబాల ప్రజలు ఉప్పుతిన్నా పప్పు తిన్నా కూడా నిజాయితీగా పన్నులు కడతారని, అటువంటి పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తాయని జేపీ గుర్తు చేశారు .

   దేశంలో రాచరిక పాలన సాగుతోంది అన్న లోక్ సత్తా అధినేత జేపీ

  దేశంలో రాచరిక పాలన సాగుతోంది అన్న లోక్ సత్తా అధినేత జేపీ

  ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజల డబ్బే అని గుర్తుంచుకొని ప్రజాధనాన్ని పవిత్రంగా భావించి ఒక రూపాయకు పది రూపాయల విలువ వచ్చేట్టు చేయాలని జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. కానీ ఈ దేశంలో రాచరిక స్వభావంతో పరిపాలన సాగుతోందని, నరేంద్ర మోదీ, అంతకుముందున్న ప్రభుత్వాలు వాళ్ల సొంత ప్రచారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయని జయప్రకాష్ నారాయణ్ విమర్శించారు . ఇక రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని, ఒకప్పుడు చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్.. ఇప్పుడు మిగతావాళ్లు అని ఆయన పాలకులు మారినా పాలనా తీరు మారటం లేదన్నారు .

  సౌకర్యాల వరకు తప్పు లేదు .. లగ్జరీలే బాధాకరం అన్న జయప్రకాశ్ నారాయణ్

  సౌకర్యాల వరకు తప్పు లేదు .. లగ్జరీలే బాధాకరం అన్న జయప్రకాశ్ నారాయణ్

  వేల కోట్ల ప్రజాధనాన్ని తమ విలాసాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు . నివాసగృహాలను రాజగృహాల మాదిరి నిర్మించుకుంటున్నారని, వీరి నివాసగృహాలన్నీ కూడా పూర్వకాలపు చక్రవర్తుల నివాసాలను తలపిస్తున్నాయని జేపీ వ్యాఖ్యానించారు. ఎవరికి నచ్చినట్టు వారు భవనాల నిర్మాణానికి గాను చదరపు అడుగుకు వేల రూపాయలను ఖర్చు పెడుతున్నారని, ఆ తర్వాత ఆ భవనాలు ఇష్టం లేదని కూల్చి వేస్తున్నారని ఇలా చెయ్యటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆయన మండిపడ్డారు. . ప్రజాధనం వినియోగం విషయంలో కనీస ఇంగితజ్ఞానం, ఒక పద్ధతి లేకుండా పోతున్నాయని వ్యాఖ్యలు చేశారు జేపీ . నేతలు వినియోగించే కార్లు, కార్యాలయాలు సౌకర్యంగా ఉండాలి .. ఇక ఆ విషయాన్ని కాదనను కానీ అందుకు, యాభై లక్షలు, డెబ్బై లక్షలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. లగ్జరీలు ప్రజాధనంతో చెయ్యకూడదు అని జయప్రకాశ్ నారాయణ్ తన అభోప్రాయం వ్యక్తం చేశారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Lok Sattha Party chief Jayaprakash Narayan opined that every penny spent by the government should be considered as a waste of the people and worthy of Rs. However, Jayaprakash Narayan criticized Narendra Modi and previous governments for spending thousands of crores on their own propaganda.The same situation in the states, once Chandrababu, then YS Rajasekhar Reddy, KCR..
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more