వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంతో దిగొచ్చిన కేంద్రం! రేపు కేబినెట్ భేటీ, ఏం లాభం.. పవన్‌కు బాబు దిమ్మతిరిగే షాక్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈ నెల 23వ తేదీన ఢిల్లీకి రావాలన్న పిలుపు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రేపు (బుధవారం) భేటీ కానుంది. కేంద్రం పిలుపు నేపథ్యంలో కేబినెట్ భేటీని రెండు రోజుల ముందు సమావేశం కానుంది. ఈ మేరకు చంద్రబాబు టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో చెప్పారు.

Recommended Video

Pawan Kalyan Dramas Over 'No Confidence Motion'

అదే బాబు ధైర్యం: మోడీని జగన్ పడగొట్టగలరా? అవిశ్వాసం ఎలా పెట్టవచ్చు, బీజేపీ లెక్క ఇదీ!అదే బాబు ధైర్యం: మోడీని జగన్ పడగొట్టగలరా? అవిశ్వాసం ఎలా పెట్టవచ్చు, బీజేపీ లెక్క ఇదీ!

కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పడం, ఆ సవాల్‌ను జగన్ స్వీకరించడం, తాను ఎంపీల మద్దతు కూడగడతానని, దమ్ముంటే మీరు మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని జనసేనాని చెప్పిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.

 రేపటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత

రేపటి కేబినెట్ భేటీకి ప్రాధాన్యత

ఏపీ బడ్జెట్‌లో కేటాయింపుపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అసంతృప్తితో ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీకి రావాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ బుధవారం భేటీ కానుంది. కేంద్రం దిగొచ్చి ఆహ్వానించిన నేపథ్యంలో బడ్జెట్‌లో ఏం మార్పులు చేయాలనే అంశంపై చర్చించనున్నారు.

 పవన్, జగన్‌లకు అవిశ్వాసంపై చంద్రబాబు షాక్

పవన్, జగన్‌లకు అవిశ్వాసంపై చంద్రబాబు షాక్

అవిశ్వాస తీర్మానంపై మరోసారి చంద్రబాబు స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అటు పవన్ కళ్యాణ్‌కు, ఇటు జగన్‌కు షాకిచ్చేలా ఉన్నాయి. ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే లాభం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే ఏపీ ప్రయోజనాలు నెరవేరుతాయా అని ఎద్దేవా చేశారు.

అందుకే చంద్రబాబు మాట్లాడుతున్నారు

అందుకే చంద్రబాబు మాట్లాడుతున్నారు

ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వేరుగా మాట్లాడుతూ.. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకం కానున్నారని చెప్పారు. ఏపీలో టీడీపీ కేడర్ బలంగా ఉందని, జగన్‌కు బలం లేదని తేల్చి చెప్పారు. నాలుగు బడ్జెట్‍‌లు పూర్తయినా చంద్రబాబు మాట్లాడ లేదని, ఇప్పుడు చివరి బడ్జెట్‌లోను అన్యాయం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నారని చెప్పారు.

 విద్యా సంస్థలపై గంటా శ్రీనివాస రావు

విద్యా సంస్థలపై గంటా శ్రీనివాస రావు

విద్యాశాఖకు కేటాయించిన నిధులపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. ఏడు యూనివర్సిటీలు ప్రకటించగా 5 మాత్రమే వచ్చాయని గంటా చెప్పారు. కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థలు ప్రయివేటు క్యాంపస్‌లలో నడుస్తున్నాయని చెప్పారు. శాశ్వత క్యాంపస్‌లకు శిలా ఫలకాలు వెక్కిరిస్తున్నాయన్నారు.

English summary
Andhra Pradesh Cabinet meeting tomorrow. Chief Minister Chandrababu Naidu will meet ministers on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X