వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నీ తప్పే, అవి చెప్పరా: మోడీ ప్రభుత్వాన్ని హిందీలో ఏకేసిన రామ్మోహన్‌నాయుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. రాజ్‌నాథ్ సింగ్ అన్నీ అబద్దాలే చెప్పారని దుయ్యబట్టారు. హిందీలో ఆయన కేంద్రాన్ని ఏకిపారేశారు. అవిశ్వాస తీర్మానంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాహుల్‌కు శివసేన మద్దతు: మోడీతో ఆలింగనంపై బీజేపీ ట్వీట్, కన్నుగీటడంపై రమ్యకు ప్రశ్నరాహుల్‌కు శివసేన మద్దతు: మోడీతో ఆలింగనంపై బీజేపీ ట్వీట్, కన్నుగీటడంపై రమ్యకు ప్రశ్న

ఎంపీ హరిబాబు విశాఖపట్నం నుంచి గెలిచి ఢిల్లీ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో భూములు, పోర్టులు ఉన్నా రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో కేంద్రం మోసం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నాటి ప్రధాని రాజ్యసభలో చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు.. పదేళ్లు కావాలని నాటి బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారన్నారు.

No Confidence Motion: TDP MP Ram Mohan Naidu issues point by point rebuttal of BJP MP Kambhampatis speech

ప్రత్యేక హోదా ప్రకటనను నాడు అరుణ్ జైట్లీ కూడా సమర్థించారన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన కొద్దిపాటి నిధుల గురించి చెబుతున్నారని, కానీ ఇవ్వాల్సిన వాటి గురించి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పినవన్నీ అవాస్తవాలే అన్నారు. నాటి ప్రభుత్వం హామీలను నేటి ప్రభుత్వం కచ్చితంగా అమలు చేయాలన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. విభజన హామీలపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎప్పుడైన సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, ఏపీ రాజధానిలపై ప్రచారం సమయంలో మోడీ ఎన్నో చెప్పారన్నారు. చట్టసభల్లో చెప్పినవి అమలు కాకుంటే ఇంకెవరికి చెప్పుకోవాలన్నారు. రైల్వే జోన్ ఇవ్వడానికి ఉన్న ఇబ్బందులేమిటని ప్రశ్నించారు.

English summary
TDP MP Ram Mohan Naidu in an impassioned speech rebutted the claims made by BJP MP Hari Babu Kambhampati. He said that the TDP does not enjoy fighting with the government but they are forced to resort to the no-confidence motion. He claimed that the promises made to the state were not fulfilled and the money released on record differed from what the government was claiming.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X