వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కోరిన టీడీపీ ఎంపీలు: ముందుకొచ్చిన స్టాలిన్, షాకిచ్చిన పళని

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభలో శుక్రవారం చర్చ జరిగే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే వివిధ పార్టీల నేతలను కలిసిన టీడీపీ ఎంపీలు.. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం ఉదయం కలిశారు.

పార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలుపార్లమెంటుకు వచ్చేది లేదు, ఏమౌతుంది?: టీడీపీలో కలకలం రేపుతున్న జేసీ వ్యాఖ్యలు

 టీడీపీ ఎంపీలకు మద్దతిస్తామన్న ఆప్

టీడీపీ ఎంపీలకు మద్దతిస్తామన్న ఆప్

అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలపై రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన బుక్‌ను కేజ్రీవాల్‌కు ఎంపీలు అందజేశారు. ఎంపీలు సుజనాచౌదరి, కొనకళ్ల నారాయణ, శ్రీరాం మాల్యాద్రి, టీజీ వెంకటేష్...కేజ్రీవాల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. ఏపీ ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌సింగ్ చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ, ఓటింగ్ సమయంలో మద్దతుగా ఉంటామని తెలిపారు. ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని ఎంపీ సంజయ్‌సింగ్ విమర్శించారు.

కేజ్రీవాల్ సానుకూలంగా..

కేజ్రీవాల్ సానుకూలంగా..

అనంతరం ఎంపీ సుజనాచౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సమస్యలపై కేజ్రీవాల్ క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నారని తెలిపారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయాన్ని వివరించామని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాల్సిందిగా కేజ్రీవాల్‌ను కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ సుజనా పేర్కొన్నారు.

చంద్రబాబు నా జూనియర్, మంచి స్నేహితుడు: రమణదీక్షితులు ఆసక్తికరం, బాబుపై ప్రశంసలు చంద్రబాబు నా జూనియర్, మంచి స్నేహితుడు: రమణదీక్షితులు ఆసక్తికరం, బాబుపై ప్రశంసలు

ముందుకొచ్చిన స్టాలిన్

ముందుకొచ్చిన స్టాలిన్

తెలుగుదేశం ఎంపీలు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెప్పారు. ఏపీకి అండగా ఉంటామని తెలిపారు. అన్నాడీఎంకే కూడా టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.

మద్దతిచ్చేదిలేదన్న పళనిస్వామి

మద్దతిచ్చేదిలేదన్న పళనిస్వామి

కాగా, టీడీపీ అవిశ్వానికి అన్నాడీఎంకే మద్దతివ్వదని తమిళనాడు సీఎం పళనిస్వామి తేల్చి చెప్పారు. కావేరీ వివాదంలో తమకెవ్వరూ మద్దతివ్వలేదని తెలిపారు. అందుకే తమ ఎంపీలు కూడా పార్లమెంటులో పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వబోరని సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు.

English summary
A TDP delegation led by Parliamentary Party leader YS Chowdary met Delhi CM Arvind Kejriwal at his residence, earlier today. They have handed over Andhra Pradesh CM N.Chandrababu Naidu’s letter seeking cooperation and support for TDP’s demand for Andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X