వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాస తీర్మానం: స్పీకర్ వైఖరి బాధాకరం: జేసీ, ఇదో చారిత్రక తప్పిదం: జీవీఎల్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాన విషయంలో లోకసభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ వైఖరిని ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తప్పుపట్టారు. నిబంధనలంటే లెక్కలేని రీతిలో కేంద్ర ప్రభుత్వం, స్పీకర్‌ వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను నిర్వర్తించిన తీరుపై జేసీ దివాకర్ రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. సంతకాలు చేసి అవిశ్వాస తీర్మానం ఇస్తే కనీసం పరిగణలోనికి తీసుకోలేదని తెలిపారు. పార్లమెంట్‌ చరిత్రలోనే ఇది బ్లాక్‌డే అని ఆయన అభివర్ణించారు.

jc-gvl

మరోవైపు ఇదే అంశంపై కేంద్రంపై బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడుతూ టీడీపీ తీరుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం తీసుకురావడం చరిత్రక తప్పిదంగా ఆయన అభివర్ణించారు. ఓటమి బాటలో ఉన్న పార్టీలతో జతకట్టిన చంద్రబాబుకు పరాజయం తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడమే టీడీపీ లక్ష్యమని విమర్శించారు. కనీస బలం లేని ఇతర పార్టీలతో కలిసి అవిశ్వాసాన్ని ఎలా నెగ్గించుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు తీరు చూస్తుంటే శునకం తోక పట్టుకుని గోదావరి ఈదినట్టుందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు.

English summary
Anantapur MP JC Diwakar Reddy critisized Loksabha Speaker Sumitra Mahajan's behaviour over TDP No Confidence Motion here in Delhi on Monday. He alleged that Central Government and Speaker Sumitra Mahajan both not giving respect to the rules and regulations. On the other hand BJP Leader GVL Narsimha Rao accused CM Chandrababu Naidu over TDP's No confidence motion against NDA Government. He said that it's a historically wrong decision of CM Chandrababu and he will face defeat in this motion, GVL concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X