వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్, అన్నాడిఎంకె ఎంపీల ఆందోళన: చర్చకు రాని అవిశ్వాసం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ
విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం నాడు పార్లమెంట్ ఉభయ సభల్లో ఇదే విధమైన వాతావరణం నెలకొంది.

మంగళవారం నాడు ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే టిఆర్ఎస్, అన్నాడిఎంకె పార్టీలకు చెందిన ఎంపీలు తమ డిమాండ్లపై ఆందోళనకు దిగారు. రిజర్వేషన్ల అంశంపై టిఆర్ఎస్ ఎంపీలు, కావేరీ బోర్డు అంశంపై అన్నాడిఎంకె ఎంపీలు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేశారు. నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ప్రారంభమైన 45 సెకన్లకే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ సుమిత్రా మహజన్.

No-confidence motions in Parliament LIVE UPDATES: loksabha adjourned till

మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి ప్రారంభమైంది.అయితే సభలో ప్రశాంత వాతావరణం లేకుండా పోయింది.ఇరాక్‌లో కిడ్నాపైన భారతీయులు 39 మందికి సంబంధించి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ కీలకమైన ప్రకటన చేస్తారని స్పీకర్ ప్రకటించారు. ఈ మేరకు సహకరించాలని సభ్యులను స్పీకర్ కోరారు.

అంతేకాదు ఈ విషయమై సహకరించాలని సుష్మాస్వరాజ్ సభలో విపక్ష పార్టీల సభ్యులను కోరారు. మానవత్వం లేదా అంటూ స్పీకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ ప్రజల సమస్యల గురించి పట్టించుకోరా అంటూ స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇరాక్‌లో చోటు చేసుకొన్న కిడ్నాపైన భారతీయులు హత్యకు గురయ్యారనే విషయాన్ని సుష్మా ప్రకటించారు.

అయితే గందరగోళం మధ్యే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ రిపోర్టును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసులు అందాయని స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు. సభ ఆర్డర్‌లో ఉంటే చర్చకు స్వీకరిస్తామని స్పీకర్ ప్రకటించారు. కానీ , సభలో గందరగోళ వాతావరణం కొనసాగింది. దీంతో లోక్‌సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ సుమిత్రా మహజన్ ప్రకటించారు.

రాజ్యసభలో ఆందోళన

లోక్‌సభలో తరహలో కూడ రాజ్యసభలో కూడ గందరగోళం నెలకొంది. అయితే రోహింగ్యాల సమస్యపై రాజ్యసభలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేశారు.
ఇరాక్‌లో గల్లంతైన 39 మంది భారతీయులు చనిపోయారని సుష్మాస్వరాజ్ ప్రకటించారు.

మృతదేహలను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.బాగ్దాద్‌లో 39 భారతీయులను ఐసిస్ తీవ్రవాదులు కాల్చి చంపారని ఆమె ప్రకటించారు. డిఎన్ఏ శాంపిల్స్ ఆధారంగా మృతదేహలను భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామని ఆమె ప్రకటించారు.

ఈ ప్రకటన తర్వాత అవిశ్వాసంపై పార్టీలు పట్టుబడ్డాయి.విపక్షాల ఎంపీలు ఆందోళనకు దిగాయి. దీంతో రాజ్యసభ కూడ బుధవారం నాటికి వాయిదా పడింది.

English summary
Following ruckus, Speaker Sumitra Mahajan has adjourned the Lok Sabha for the day. The House will convene at 11 am on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X