రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'చెప్పాల్సిందంతా చెప్పేశా, ఆస్తులను పోగొట్టుకొన్నా, ఇక బాబుదే నిర్ణయం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి:ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పార్టీ నాయకత్వంపై మాజీ మంత్రి , సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను నమ్మిన సిద్దాంతాలను తాను వదులుకోనని బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.అయితే పార్టీ నాయకత్వానికి, తనకు మధ్య గ్యాప్ లేదంటున్నారాయన.

ఈ నెల 2వ, తేదిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు.అయితే ఈ పునర్వవ్యవస్థీకరణ సందర్భంగా టిడిపిలో తీవ్ర అసంతృప్తి చేలరేగింది.

వైసీపీని వీడి టిడిపిలో చేరిన నలుగురికి మంత్రివర్గంలో చోటు కల్పించారు చంద్రబాబునాయుడు.అయితే అదే సమయంలో పార్టీని కష్టసమయంలో అంటిపెట్టుకొని ఉన్న వారికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం వల్ల బాబుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేశారు.మంత్రివర్గంలో చోటు దక్కుతోందని భావించిన బుచ్చయ్య చౌదరికి నిరాశ కల్గింది.దీంతో ఆయన బహిరంగంగానే విమర్శలు చేశారు.

ప్రజా సేవకే కట్టుబడి ఉన్నా

ప్రజా సేవకే కట్టుబడి ఉన్నా

ప్రజా సేవకే కట్టుబడి ఉన్నానని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. తాను చేసే పనిలో వేగం తగ్గలేదన్నారు. యువకులకంటే తానే బాగా పనిచేస్తున్నానని చెప్పారు. కష్టపడి పనిచేస్తానని మరో సారి చెప్పారు. తాను నమ్మిన సిద్దాంతాలను తాను వదులుకోనని చెప్పారు. ప్రజాసేవకుడిగా అభివఈద్ది థృక్పథం ఉన్న నేతగా ఉండాలనేది తన లక్ష్యంగా చెప్పారు బుచ్చయ్య చౌదరి.

పార్టీతో గ్యాప్ లేదు

పార్టీతో గ్యాప్ లేదు

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.అయితే బాబుపై విమర్శలు చేసిన తర్వాత డిప్యూటీ సిఎం చినరాజప్ప గోరంట్ల బుచ్చయ్య చౌదరితో చర్చించారు. అయితే తనకు పార్టీ నాయకత్వానికి మద్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.అవకాశవాదులు తమ పబ్బం గడుపుకొనేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. అనేక మంది వెన్నుపోటుదారుల్ని చూసినట్టు బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఎన్నికల్లో దెబ్బతీయాలని చూశారు. ప్రజలతో , పార్టీ వర్గాలతో చర్చిస్తూనే ఉన్నానని చెప్పారు. ప్రజల కోసం నిత్యం అధికారులతో మాట్లాడుతూనే ఉన్నానని చెప్పారు.

చెప్పాల్సిదంతా చెప్పేశా

చెప్పాల్సిదంతా చెప్పేశా

మంత్రివర్గంలో తనకు స్థానం దక్కకపోవడం పట్ల తాను చెప్పదల్చుకొన్న అంశాలను పార్టీ నాయకత్వానికి చెప్పేశానని బుచ్చయ్య చౌదరి చెప్పారు. కార్యకర్తల మనస్సుల్లోని మాటలను బైట పెట్టినట్టు చెప్పారు. తన సూచనలను పార్టీ అధిష్టానం మంచిగా భావించి తగిన నిర్ణయం తీసుకొంటుందని భావిస్తున్నట్టు ఆయన చెప్పార. తనకు స్వార్థం ఏమీ లేదన్నారు. ఇప్పటికీ క్రియాశీలకంగానే ఉన్నానని ఆయన చెప్పారు.

ఆస్తులను పోగొట్టుకొన్నా

ఆస్తులను పోగొట్టుకొన్నా

రాజకీయాల్లోకి రాకముందే కాంట్రాక్టర్ గా బాగా సంపాదించినట్టు ఆయన చెప్పారు.అయితే రాజకీయాల్లోకి వచ్చాక తాను సంపాదించిన ఆస్తులను పోగొట్టుకొన్నానని చెప్పారు. అయితే ఆస్తులను పోగొట్టుకొన్నాననే బాధ తనకు లేదన్నారు. ప్రజల అండతో రాజమండ్రి నుండి ఐదు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టిడిపిలో వెలుగు వెలుగుతున్న నాయకులను తానే పార్టీలోకి తెచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బ్రహ్మణులకు కార్పోరేషన్, మోస్ట్ బ్యాక్ వర్డ్ కమ్యూనిటీ గురించి బాబుతో చర్చించిన విషయాలను ఆయన గుర్తు చేస్తున్నారు.

కాంట్రాక్టర్ గా ఉంటూనే రాజకీయాల్లోకి

కాంట్రాక్టర్ గా ఉంటూనే రాజకీయాల్లోకి

రాజకీయాల్లోకి రాకముందే బుచ్చయ్య చౌదరి కాంట్రాక్టర్ గా పనిచేసేవాడు. తొలుత ఫారెస్టు , తర్వాత రైల్వే కాంట్రాక్టర్ గా పనిచేశాడు. బిల్డర్ గా రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నాడు. అయితే రాజమండ్రిలోని పోలీస్ క్లబ్ ను తానే నిర్మించిన విషయాన్ని చెప్పారు.అయితే తమది కమ్యూనిష్టు కుటుంబమని చెప్పారు. తన తల్లి అనసూయమ్మ, మామయ్య కుటుంబం కమ్యూనిష్టులేనని చెప్పారు. విధ్యార్థి దశ నుండి కమ్యూనిష్టు కార్యకర్తగా పనిచేసినట్టు చెప్పారు. సుందరయ్య, నాగిరెడ్డి, కొల్లా వెంకయ్య బసవపున్నయ్య లాంటి నాయకులు తమ ఇంటికి వచ్చేవారని ఆయన గుర్తు చేసుకొన్నారు. ఎన్ టి ఆర్ పార్టీని స్థాపించిన తర్వాత టిడిపిలో చేరినట్టు ఆయన చెప్పారు.

English summary
No differences between me and party leadership said formerminister Gorantla Buchaiah chowdary. Iam said my opinion to party, party will take decission he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X