వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరాకాష్ట: ఏపీ సినీ ‘నంది’ అవార్డులపై విమర్శల జడి.. ఏకపక్ష కమ్మ ఎంపికలన్న విమర్శలు

తెలంగాణ పట్ల ఎంత వివక్ష ఉన్నదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నంది అవార్డుల కమిటీ ప్రకటించిన అవార్డుల వివరాలు తెలియజేస్తున్నాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Lezend Gets 9 Nandi awards : అందుకే 'రఘుపతి వెంకయ్య' అవార్డుకు చిరంజీవి | Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి‌: తెలుగు నాట సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. తొలినాళ్లలో సమాజానికి సందేశాత్మక సినిమాలు అందించిన ఘనత టాలీవుడ్‌ది. అంతే కాదు సినీ నటనలో యావత్ ప్రపంచమే ముక్కున వేలేసుకునేలా తెలుగు సినీ రంగం పని చేసి యావత్ ప్రపంచాన్నే ఔరా అనిపించింది. అరవయ్యేళ్లు వచ్చే వరకు కళామతల్లికి సేవ చేసి.. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి.. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల సమయంలోనే అధికారంలోకి వచ్చి తెలుగుగడ్డపై చరిత్ర స్రుష్టించిన ఘనత నందమూరి తారక రామారావుది.. కాదు మన అన్నగారిది.
వ్యతిరేకించినా ఆయన దగ్గరకు వెళ్లిన తర్వాత గౌరవించే సమున్నత వ్యక్తిత్వం ఎన్టీఆర్‌కు సొంతం. ఆయన, అక్కినేని నాగేశ్వర్ రావు వంటి వారు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ల వంటి వారు. ఎన్టీఆర్ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సినీ రంగ పరిశ్రమ ప్రముఖులందరినీ తన అక్కున చేర్చుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు.

‘మనం’ ఏఎన్నార్ చివరి చిత్రం

‘మనం’ ఏఎన్నార్ చివరి చిత్రం

ఎన్టీఆర్ కోసం కార్యక్రమాల్లో పాల్గొనబోనని భీష్మించిన మంగళంపల్లి మురళీక్రుష్ణ వంటి వారిని నాలుగోసారి 1994లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సన్మానించి గౌరవించుకున్న గొప్పతనం అన్నగారిదే. కానీ అక్కినేని ఇంట నాగేశ్వర్ రావు, తనయుడు నాగార్జున, మనుమడు నాగ చైతన్య నటించిన ‘మనం' తెలుగు సినీ రంగానికి ఒక చారిత్రక చిత్రం.. ఏఎన్నార్ కు చివరి చిత్రం. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూనే చివరి క్షణం వరకూ సినిమా షూటింగ్‌లో గడిపి నింగికేగిన నేపథ్యం ఏఎన్నార్‌ది. కానీ ఆ సినిమా మాత్రం ‘నంది' అవార్డుల ఎంపిక కమిటీ పరిశీలనకే రాలేదని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు, సినీ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రాంగోపాల్ వర్మపై జ్యూరీ సభ్యుడు మద్దినేని విమర్శల వీరంగం

రాంగోపాల్ వర్మపై జ్యూరీ సభ్యుడు మద్దినేని విమర్శల వీరంగం

గతంలో తెలుగు సినిమా రంగంలో పరిస్థితులతో పోలిస్తే కానీ ఈనాడు పరిస్థితులు అందుకు భిన్నంగా సాగుతున్నాయా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలుగు నాట సినీ రంగంలో తొలి దశలో ‘నంది' అవార్డుల ప్రదానానికి ఎంతో ప్రాధాన్యం ఉండేది. మొదట్లో తెర వెనుక లాబీయింగ్ మాటెలా ఉన్నా.. బహిరంగ వ్యాఖ్యానాలు వచ్చేవి కావు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన నంది అవార్డుల జ్యూరీ కమిటీ.. 2014, 2015, 2016 సంవత్సరాలకు నంది అవార్డుల ప్రదానోత్సవంలో ఇష్టారీతిన.. ఒక సామాజిక వర్గానికే.. అందునా కావాల్సిన వారికే పెద్దపీట వేసిందన్న విమర్శలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. సినీ రంగంలో పేరున్న దర్శకుడు రాం గోపాల్ వర్మ తదితరులను ఉద్దేశించి జ్యూరీలో సభ్యుడిగా మద్దినేని రమేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు, బూతు పురాణం గురించి మాట్లాడటం ఎబ్బెట్టుగా.. ఎంబరాసింగ్‌గా మారిందంటే అతి శయోక్తి కాదు. దర్శకుల వ్యక్తిగత అంశాల్లోకి వెళ్లి విమర్శలు చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. విమర్శకు ప్రతి విమర్శ చేయడంలో రాం గోపాల్ వర్మను ఎదుర్కొనే వారే లేరు. తనపై చేసిన వ్యాఖ్యలకు ధీటుగానే ‘కమ్మ కమ్మ'గా అవార్డులు పంచేసుకున్నారని రిటార్ట్ ఇచ్చేశారు. అంతకంటే గొప్ప విషయమేమిటంటే తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన ‘బాహుబలి'లో నటించిన ప్రభాస్ వంటి వారి ఊసే లేదు. కానీ అదంతా రాజమౌళి క్రెడిట్ అని కొందరు సరి కొత్త వాదన తీసుకు రావడం గమనార్హం.

అవార్డులపై స్పందించని బాలయ్య

అవార్డులపై స్పందించని బాలయ్య

హిందూపురం ఎమ్మెల్యే - సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్' సినిమాకు వరుసగా తొమ్మిది నంది అవార్డులు ప్రదానం చేయడమే వింతగా మారింది. దీన్ని లక్ష్యంగా చేసుకుని నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘కమ్మ కమ్మ'గా అవార్డులు పంచేసుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ మాటకు వస్తే తెలంగాణ గడ్డ వేదికగా తెలుగు గడ్డను ఏలిన ‘రుద్రమదేవి' సినిమా అవార్డు ఇచ్చేందుకే నోచుకోలేదంటే తెలంగాణ అంటే వివక్ష ఏమిటో అర్థమవుతూనే ఉన్నదని సినీ కథా రచయిత ప్రేమ్ రాజు, రికమండేషన్లు కావాలని నిర్మాత అడ్డాల చంటి వారు బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

రేసు గుర్రం సినిమాపై అసంబద్ధ వాదన ఇలా

రేసు గుర్రం సినిమాపై అసంబద్ధ వాదన ఇలా

అన్నింటికి మించి తెలుగు సినిమాకు రెండు కళ్ల వంటి వారుగా భావించే ఎన్టీఆర్, ఏఎన్నార్ ల్లో అక్కినేని మరణించడానికి ముందు నటించిన ఆయన చివరి చిత్రం.. ఆయన జీవిత కథపైన మూడు తరాల అక్కినేని కుటుంబ సభ్యులు నటించిన చిత్రం ‘మనం' వైపే జ్యూరీ సభ్యులు తొంగి చూడలేదని అవార్డుల ప్రకటన తెలియజేస్తున్నదని ప్రముఖుల అభిప్రాయం. తెలంగాణ పట్ల తొలి నుంచి కొనసాగుతున్న వివక్ష సంగతి పక్కనబెట్టినా.. ‘మనం', ‘రేసుగుర్రం' వంటి సినిమాలు అవార్డులకు నోచుకునే సందేశాలేమీ ఇవ్వలేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జ్యూరీలో సభ్యురాలిగా జీవితా రాజశేఖర్... నంది అవార్డుల ఎంపికపై జరుగుతున్న రచ్చతో చలించిపోయినట్లు ఉన్నారు. ‘సినీ పరిశ్రమ' పరువు తీసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినీ నటిగా ఆమె ఆవేదన అర్థం చేసుకోదగిందే. అదే సమయంలో రేసు గుర్రం సినిమాలో నటించిన అల్లు అర్జున్ కు సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవార్డు ప్రకటించామని పేర్కొన్నారు. అవార్డుల ప్రదానానికి జ్యూరీ సభ్యుల ప్రక్రియ ఎలా సాగిందో తెలియకుండా మాట్లాడొద్దని కూడా పేర్కొన్న జీవిత వంటి వారికి ‘రుద్రమదేవి' కంటే చారిత్రక నేపథ్యం గల సినిమాలు పోటీ నిచ్చినట్లు కనిపించాయా? లేదా? అని సందేహిస్తున్నామని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2015 సంవత్సర అవార్డుల కమిటీకి జ్యూరీ కమిటీ చైర్ పర్సన్‌ జీవిత చేసిన వ్యాఖ్యలే అసంబద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రేసు గుర్రంలో అల్లు అర్జున్ పాత్ర నచ్చినందు వల్లే ఎస్వీ రంగారావు పేరిట అవార్డు ప్రకటించామని చెప్పడమే కాదు గొప్ప విషయంగా భావిస్తున్నామని సెలవిచ్చారు. దీనిపై అల్లు అరవింద్, చిరంజీవి, బన్నీ మాట్లాడలేదని, బయటి వారే మాట్లాడుతున్నారని కూడా పేర్కొన్న జీవితా రాజశేఖర్.. ప్రముఖుల విషయమై బయట నుంచి చూసే వారికి అందరి నటన, చర్యలపై స్పందించే భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందన్న విషయం మరిచిపోయారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యూహాత్మకంగా రఘుపతి వెంకయ్య అవార్డుకు చిరంజీవి

వ్యూహాత్మకంగా రఘుపతి వెంకయ్య అవార్డుకు చిరంజీవి

ఒకవేళ ఈ అవార్డుల ఎంపికలో గందరగోళం, ఏకపక్ష వైఖరి ప్రదర్శించకపోతే ఇప్పటివరకు నందమూరి బాలక్రుష్ణ ఎందుకు స్పందించ నిరాకరిస్తున్నారన్న విషయం సందేహస్పదంగానే ఉన్నదని విశ్లేషకుల మాట. ఆఖరుకు నంది అవార్డుల ఎంపికపై మీడియా ముందుకు వచ్చిన, సోషల్ మీడియాలో స్పందించిన సినీ ప్రముఖులకు హెచ్చరికలతో కూడిన బెదిరింపులు రావడంతోనే సినీ రంగంలో అందునా తెలుగునాట టాలీవుడ్‌లో ఆధిపత్య ధోరణులు ఎలా పెరిగిపోయాయో అవగతమవుతూనే ఉన్నదని చెప్తున్నారు. ‘మెగా' కుటుంబం అంతగా స్పందించకుండా ఉండేందుకే.. మెగాస్టార్ చిరంజీవిని ‘రఘుపతి వెంకయ్య' అవార్డుకు ఎంపిక చేసి అవార్డుల కమిటీ వ్యూహాత్మకంగా జాగ్రత్త పడిందని తెలుస్తున్నది.

ఏపీలో ఫిరాయింపులకే ఈనాడు పెద్దపీట

ఏపీలో ఫిరాయింపులకే ఈనాడు పెద్దపీట

ఇక తొమ్మిది నందులు అందుకున్న లెజెండ్ సినీ కథ.. అందులో బాలక్రుష్ణ నటన.. డైలాగ్స్.. ఇబ్బందికరంగా ఉన్నాయంటే అతి శయోక్తి కాదు. రాజకీయం తమ బ్లడ్‌లోనే ఉన్నదని బాలయ్య మొదలు అబ్బాయి.. జూనియర్ ఎన్టీఆర్ వరకు గొప్పగా డైలాగులు పలికేస్తున్నారు. అన్నగారికి తెలుగు గడ్డపై ఉన్న ప్రజాదరణను సొమ్ము చేసుకునేందుకు... బాబాయ్.. అబ్బాయ్‌లను మెప్పించేందుకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అదినేతగా ఎన్టీఆర్ పేరును, నానుడిని, డైలాగుల డెలివరీలను సినీ రంగం వాడుకుంటున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల్లో డబ్బు పెట్టుబడి పెట్టినప్పుడు అది తిరిగి రావాలన్న సంకల్పంతో గతానుభవాల నుంచి.. ప్రముఖుల గొప్పతనం ఆధారంగా రాసే డైలాగులు.. ఆయన నట వారసత్వానికి హుందాతనాన్నిచ్చేలా రూపొందించాలే గానీ.. లెజెండ్ సినిమాలో వచ్చిన డైలాగ్ లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని విశ్లేషకులు గట్టిగా విశ్వసిస్తున్నారు. తిక్క నా వంట్లోనే ఉంటుందని బాలక్రుష్ణ డైలాగ్.. అదే బాలక్రుష్ణ తన వంట్లోనే బ్లడ్ లోనే రాజకీయం ఇంకి ఉన్నదని చెప్పారు.

ఫిరాయింపులతోనే క్యాబినెట్ ఇలా నేడు

ఫిరాయింపులతోనే క్యాబినెట్ ఇలా నేడు

1980వ దశకంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు నాట నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనూ.. తనను ఆదరించిన తెలుగు ప్రజలకు సేవ చేసే లక్ష్యంతోనూ నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి అదికారంలోకి వచ్చారు. పేదవాడికి అందుబాటులోకి పాలనను తీసుకొచ్చారు. కానీ ఈనాడు ఆయన వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డిని దెబ్బ తీసేందుకు జోరుగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన నేపథ్యం కలిగి ఉన్నారు. కానీ నాటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ముందుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్.. అంతే తప్ప తెలుగు నాట రాజకీయానికి వారసత్వం వహించాలంటే ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన వారికే సాధ్యమన్న అభిప్రాయం ఉన్నది.

లెజెండ్ సినిమాలో ఇలా ఫిరాయింపులకు వ్యతిరేకమని సందేశం

లెజెండ్ సినిమాలో ఇలా ఫిరాయింపులకు వ్యతిరేకమని సందేశం

దీన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఫిరాయింపు నేతలపై చర్య తీసుకోవాల్సిన అధికారం స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుదే. ఏపీ శాసనసభాపతి కోడెల శివ ప్రసాదరావు కూడా విపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ రాజ్యాంగ బద్ధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే గానీ న్యాయస్థానాలు కావు. అలాగే స్పీకర్ విచక్షణాధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు.. ఈ విషయం ఆయనకూ తెలిసే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురు దాడి చేశారు. ఇదే ఫిరాయింపుల అంశం.. తొమ్మిది నందులు అందుకోనున్న ‘లెజెండ్'లో ప్రస్తావనకు వచ్చింది. స్వార్థ ప్రయోజనాల కోసం వేరే పార్టీలోకి మారొద్దని, ఇతరులకు మద్దతు ఇవ్వొద్దని, పార్టీ ఫిరాయించొద్దని సినిమాలో ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు బాలయ్య.

ఫిరాయింపు నేతలకు ‘లెజెండ్’ చూపితే సరి

ఫిరాయింపు నేతలకు ‘లెజెండ్’ చూపితే సరి

మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవేంద్రుల రాజధాని ‘అమరావతి' పేరిట చేపట్టిన రాజదాని నగరం సాక్షిగా జరుగుతున్న ఫిరాయింపులకు.. దాని వెనుక పరిణామాలకు కారణమేమిటి? ఆ నేపథ్యం ఏమిటన్నది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘లెజెండ్'కు తొమ్మిది నందుల ఎంపికపైనా స్పందించిన నెటిజన్లు... ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఆ సినిమా చూపిస్తే క్లారిటీ వస్తుందేమోనని వ్యాఖ్యానించారు. నిజంగా ఆ పని చేస్తే అసలు మర్మమేమిటో.. సినిమాలో డైలాగులకేనా? ఆచరణ కోసమేనా? అన్న సంగతి బయట పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
There is rumours that unilateral decisions in Nandi Awards selections in Tollywood. Nandamuri Balakrishna lead caractor cinima 'Lezend' gets 9 Nandi awards. Other side best films just like Rudramadevi and Manam. But these cinimas didn't get oppurtunity for awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X