వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్, రైల్వే జోన్‌ను వ్యతిరేకించట్లేదు, కేంద్రమంత్రే అలా చెప్పారు: బీజేపీకి ఒడిశా ఎంపీ షాక్

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తేల్చి చెప్పింది. కానీ ఇటీవల విశాఖ రైల్వే జోన్‌పై ఊగిసలాట వార్తలు వచ్చాయి.

చదవండి: నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

దీనిపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం స్పందించారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే దీనికి ప్రధాన అడ్డంకిగా భావిస్తున్న ఒడిశాకు చెందిన ఎంపీ కూడా సానుకూలంగా స్పందించారు.

చదవండి: టిడిపిని అడిగాం: అవిశ్వాస తీర్మానంపై జగన్, లోకసభ జనరల్ సెక్రటరీకి నోటీసులు

మేం వ్యతిరేకించడం లేదు

మేం వ్యతిరేకించడం లేదు

ఒడిశాకు చెందిన ఎంపీ, ఆ రాష్ట్ర అధికార పార్టీ బిజూ జనతా దళ్ నేత ఎన్‌బీ రావు (ఎన్ భాస్కర రావు) గురువారం మాట్లాడారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటును ఒడిశా ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్న వార్తల్లో నిజం లేదని, అదంతా తప్పుడు ప్రచారం అన్నారు. తెలుగు రాష్ట్రాలకు కలిపి జోన్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

కేంద్రమంత్రే అలా చెప్పారు

కేంద్రమంత్రే అలా చెప్పారు

విశాఖపట్నంలో రైల్వే జోన్‌ను తాము వ్యతిరేకించడం లేదని ఆయన చెప్పారు. తమకు మూడు రైల్వే డివిజన్‌లు మాత్రమే ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఈ నెల 13న కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశామని, మూడు డివిజన్లు ఏర్పాటు చేసి ఈస్ట్ కోస్ట్ జోన్‌లోకి తీసుకు రావాలని కోరగా కొత్త జోన్‌లు, డివిజన్‌లు పెంచే ఉద్దేశ్యం లేదని చెప్పారని బీజేపీకి కూడా షాకిచ్చారు.

ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం లేదన్నారు

ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం లేదన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేకంగా రైల్వే జోన్ ఇవ్వడం లేదని కేంద్రమంత్రి చెప్పాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రైల్వే జోన్ గురించి అసలు తమను ఎవరూ సంప్రదించలేదన్నారు.

ఓ వైపు ఏపీలో టీడీపీ వర్సెస్ బీజేపీ, తెరపైకి బీజేడీ ఎంపీ

ఓ వైపు ఏపీలో టీడీపీ వర్సెస్ బీజేపీ, తెరపైకి బీజేడీ ఎంపీ

ఓ వైపు ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు రాజుకున్న నేపథ్యంలో ఒడిశా ఎంపీ వ్యాఖ్యలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. విశాఖ జోన్ కోసం ఒడిశాను సంప్రదించాల్సి ఉందని టీడీపీ, బీజేపీలు చెబుతూ వచ్చాయి. ఆ ఎంపీ మాత్రం తమను ఎవరూ సంప్రదించ లేదన్నారు. అంతేకాదు, తాము అడ్డు కాదని, తమను ఈ వివాదంలోకి లాగవద్దని అభిప్రాయపడుతూ షాకిచ్చారు.

English summary
Odisha BJD MP NB Rao on Thursday said that they are not against Vishakapatnam Railway zone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X