అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రజ్యోతికి జగన్ షాక్, 'ఆ సినిమాలో చంద్రబాబే విలన్.. నిజం తెలియాలి'

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న ప్లీనరీ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్‌కు షాకిచ్చింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట జరుగుతున్న ప్లీనరీ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతికి, ఏబీఎన్‌కు షాకిచ్చింది.

చదవండి: చంద్రబాబు ఎప్పుడు ఏమవుతారో తెలియదు: కొడాలి నాని

తన ప్లీనరీ కవరేజీకి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను వైసిపి అనుమతించలేదు. వాటికి ఆహ్వానం పంపించలేదు. అయినప్పటికీ ఆంధ్రజ్యోతి ప్లీనరీ వేదిక వద్దకు వెళ్లింది.

ఆంధ్రజ్యోతికి నిరాకరణ

ఆంధ్రజ్యోతికి నిరాకరణ

ఆంధ్రజ్యోతి ప్రతినిధులను వైసిపి ప్లీనరీకి నిరాకరించింది. అక్రిడేషన్ కార్డులు చూపించినా నో చెప్పారు. ప్లీనరీకి వచ్చిన మీడియాను లోపలకు అనుమతించేందుకు వైసిపి అక్రిడేషన్ కార్డులు చూపించమని అడిగింది.

అక్రిడేషన్ కనిపించడంతో..

అక్రిడేషన్ కనిపించడంతో..

అక్రిడేషన్ కార్డు పైన ఆంధ్రజ్యోతి అని కనిపించడంతో లోపలకు అనుమతించలేదని తెలుస్తోంది. అక్రిడేషన్ కార్డులు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, రక్షణ సంస్థల అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే అవసరమవుతాయి.

ఈ సినిమాలో బాబు విలన్

ఈ సినిమాలో బాబు విలన్

ఎన్టీ రామారానవు జీవితంపై తెలుగులో దర్శకులు రామ్ గోపాల్ వర్మ రూపొందించబోయే సినిమాలో చంద్రబాబే విలన్‌ అని వైసిపి నేత జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్‌పై చెప్పులు, రాళ్లు వేయించి, అవమానించి ఆయన మరణానికి కారణమైంది చంద్రబాబే అన్నారు. ఇవన్నీ ఆ సినిమాలో చూపించాలని, ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter
మజ్జిగ పేరుతో హెరిటేజ్‌కు రూ.39 కోట్లు

మజ్జిగ పేరుతో హెరిటేజ్‌కు రూ.39 కోట్లు


చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎందెందుకు వెదికినా అవినీతే అన్నట్లుగా మారిందని ప్లీనరీలో అంబటి రాంబాబు అన్నారు. గతంలో హైటెక్ సిటీ కట్టాలని నిర్ణయించి ఆ ప్రాంతంలో ముందుగా తన వారితో ముందే భూములు కొనుగోలు చేయించి తర్వాత హైటెక్ సిటీ నిర్మించారని, తనవాళ్లు ముందే కొన్న భూములను రియల్ ఎస్టేట్‌ చేసి రూ.లక్షల కోట్లు తినేలా చేశారని, ఇప్పుడు రాజధాని అమరావతి వద్దా అలాగే చేశారని ఆరోపించారు. మొన్న ఎండాకాలంలో మజ్జిగ కేంద్రాలంటూ రూ.39 కోట్లు కేటాయించారని, ఆ సొమ్ము వారి సంస్థ హెరిటేజ్‌కే వెళ్లిందన్నారు.

English summary
No entrance for Andhra Jyothi in YSRCP plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X