చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నారావారిపల్లిలోకి వారికి నో ఎంట్రీ!: పోలీసులు ఆపేస్తే వీళ్లు హెచ్చరించారు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

చిత్తూరు:అది సాక్షాత్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వస్థలమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లి...గత కొన్ని రోజులుగా బస్సు యాత్ర చేపట్టిన వామపక్షాలు తమ యాత్రలో భాగంగా నారావారిపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించాలని భావించాయి. ఆ క్రమంలో విలేకరులను కూడా తీసుకెళ్లాలని నిర్ణయించాయి.

అయితే కారణాలేమైనప్పటికీ సిపిఎం-సిపిఐ నేతల బృందాన్ని పోలీసులు నారావారిపల్లిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. వారిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు కాదు గదా...అసలు నారావారిపల్లిలోకే అడుగు పెట్టకుండా సుమారు ఒక కిలోమీటర్‌ దూరంలోనే పోలీసులు ఆపేశారు. అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లతో భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వారిని అక్కడ నుంచి ముందుకు రానీయకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు.
దీంతో చేసేదేమీ లేక కమ్యూనిస్టులు మరోసారి ఈ సంగతి చూస్తామని హెచ్చరించి వెనుదిరిగారు.

బస్సు యాత్ర...చిత్తూరుకు చేరిక

బస్సు యాత్ర...చిత్తూరుకు చేరిక

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో సిపిఎం-సిపిఐ రాష్ట్రంలో రెండువైపుల నుంచి బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రం ఈ కొస నుంచి ప్రారంభమైన ఒక బస్సు యాత్ర మంగళవారం చిత్తూరు జిల్లాకు చేరుకుంది. ఈ క్రమంలో బస్సు యాత్రలో ఉన్న రెండు కమ్యూనిస్టు పార్టీల నేతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వస్థలమైన నారావారిపల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించాలని భావించారు.

ఆదిలోనే...అడ్డుకున్నారు

ఆదిలోనే...అడ్డుకున్నారు

8 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ఆరోగ్య కేంద్ర అభివృద్ది పనుల్లో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వస్తుండటమే వారు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను సందర్శించాలని నిర్ణయించుకోవడానికి కారణమని తెలుస్తోంది. అలా ఆ ఆస్పత్రి వద్దకు బయలుదేరిన వామపక్షాల బృందానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. కమ్యూనిస్టుల రాక సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నారావారిపల్లికి ఒక కిలోమీటరు దూరంలోనే రంగంపేట వద్దే బారికేడ్లతో గ్రామానికి వెళ్లే దారిని మూసేశారు. అంతేకాదు ఇక్కడ ఏమైనా గలాటా జరిగితే అదుపుచేసేందుకు వీలుగా భారీ సంఖ్యలో పోలీసులను సైతం మోహరించారు.

పోలీసు బలగాలు... మోహరింపు

పోలీసు బలగాలు... మోహరింపు

ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు తదితర వామపక్షాల నేతల పట్ల వారు అప్రజాస్వామికంగా, దురుసుగా వ్యవహరించారని తెలిసింది. తాము నారావారిపల్లి అభివృద్ధిని చూసేందుకే వెళుతున్నామని కమ్యూనిష్టు నేతలు ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదని సమాచారం. దీంతో వీరు బారికేడ్లను తప్పించుకుని గ్రామంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఈక్రమంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉదిక్త్రత చోటు చేసుకుంది.

మీడియాను కూడా...అనుమతించలేదు

మీడియాను కూడా...అనుమతించలేదు

ఎంత నచ్చచెప్పినా పోలీసులు ససేమిరా అనడంతో నేతలు తమను నారావారాపల్లిలోకి అనుమతించాల్సిందిగా నడి రోడ్డుపైనే మండుటెండలో బైఠాయించారు. దీంతో పై అధికారులతో మాట్లాడిన చంద్రగిరి సిఐ సురేంద్రనాయుడు చివరకు ఐదుగురిని మాత్రం హాస్పటల్ చూసేందుకు అనుమతిస్తామని..అయితే వారితో పాటు మీడియాను అనుమతించబోమని తేల్చిచెప్పారు. దీంతో మీడియాకు అనుమతి నిరాకరించడంతో పాత్రికేయులు సైతం ఆందోళనకు దిగారు.

మళ్లీ వస్తాం...హెచ్చరిక

మళ్లీ వస్తాం...హెచ్చరిక

ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ... "చంద్రబాబూ విను...వామపక్షాలు మహాగర్జన అయిన వెంటనే నారావారిపల్లిలో నువ్వు చేసిన అభివృద్ధి డొల్లను పరిశీలించి తీరుతాం...పోలీసులతో అడ్డుకున్నా, ఫిరంగులతో ఎదిరించినా మా పర్యటన ఆపేది లేదు"...అని హెచ్చరించారు. సిపిఎం నేత శ్రీనివాసరావు మాట్లాడుతూ..."తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మించిన నారావారిపల్లి హెల్త్‌ సెంటర్‌లో డాక్టర్లు లేరు...వైద్యసౌకర్యాలు లేవు...ఈ బండారమంతా కమ్యూనిస్టులు బయట పెడతారనే భయంతో చంద్రబాబు పోలీసులను ఉసిగొల్పి అడ్డుకున్నారు"...అని చెప్పారు. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే తమను ఆహ్వానించి చూపించేవారని ఆయన అన్నారు. నారావారిపల్లి కూడా భారతదేశంలో ఒక భాగమేనన్నారు. పాత్రికేయులను నిరాకరించడంతో హెల్త్ సెంటర్ పరిశీలనను రద్దు చేసుకున్న వామపక్షాల నేతలు మళ్లీ వస్తామంటూ హెచ్చరించి పీలేరుకు బయలుదేరి వెళ్లారు.

English summary
Chittoor:The police have ruined the Communist Party's attempt to examine the community health center in Chief Minister Chandrababu own village Naravaripalli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X