వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుది బ్లేమ్‌గేమ్, ఏపీకి హోదా ఇస్తే అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి:జవదేకర్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏపీ రాష్ట్రానికి ఇప్పటివరకు ఎంతో చేశామని, ఇంకా ఎంతో చేయనున్నట్టు ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రం ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఎలాంటి సహయం చేయలేదని బుధవారం నాడు ఢిల్లీ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు జవదేకర్ ధీటుగా సమాధానం ఇచ్చారు.

బుధవారం నాడు సాయంత్రం న్యూఢిల్లీలో ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేశామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రం విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బాబు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు

బాబు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేశామని చెప్పారు. ఇంకా సహయం చేస్తామని ఆయన చెప్పారు.

స్నేహనికి ప్రాధాన్యత

స్నేహనికి ప్రాధాన్యత

తాము స్నేహనికి విలువ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కానీ, స్నేహం కంటే భారత ప్రజలు భారత అబివృద్దికి ప్రాధాన్యతను ఇస్తారని ఆయన చెప్పారు. తమ స్నేహనికి టిడిపి వదులుకొందని జవదేకర్ గుర్తు చేశారు. టిడిపి తమను విడిపోయినా తాము ఏపీ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఆపలేదని ఆయన చెప్పారు. రాష్ట్రాభివృద్దికి కట్టుబడి ఉన్నామని జవదేకర్ చెప్పారు.

కాంగ్రెస్‌ నేతలను బాబు ఎందుకు కలుస్తున్నారు

కాంగ్రెస్‌ నేతలను బాబు ఎందుకు కలుస్తున్నారు

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాము టిడిపితో కలిసి ఎన్నికల్లో పోటీ చేశామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు. కానీ, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ నేతలను కలుస్తున్నారని ఆయన చెప్పారు. బాబు కాంగ్రెస్ పార్టీ నేతలను ఎందుకు కలుస్తున్నారని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదాను ఇతర రాష్ట్రాలు అడుగుతాయి

ప్రత్యేక హోదాను ఇతర రాష్ట్రాలు అడుగుతాయి

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు కూడ ప్రత్యేక హోదాను ఇవ్వాలని అడుగుతాయని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ చెప్పారు.అభివృద్ది విషయంలో రాజకీయాలకు తావు లేదని ఆయన చెప్పారు.

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు

దేశంలోని ఏ రాష్ట్రానికి కూడ ప్రత్యేక హోదా లేదని బిజెపి జాతీయ అధికార ప్రతినిది, ఎంపీ, జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ప్రత్యేక హోదాతో సమానమైన నిధులను ఇస్తామని ఏపీకి చెప్పినా ఆ రాష్ట్రం ఆ నిదులను వాడుకొనే పరిస్థితిలో లేదన్నారు. ఏపీ రాష్ట్రాభివృద్దిపై చంద్రబాబునాయుడు ఇప్పటికైనా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కేంద్రం నుండి వచ్చిన నిధుల విషయమై ఏపీ రాష్ట్రానికి జవాబుదారీతనం లేదన్నారు. అభివృద్ది నినాదంగానే బిజెపి దూసుకెళ్తోందన్నారు.ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. పశ్చిమ బెంగాల్, కేరళలో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉన్నాయని, ఆయా రాష్ట్రాల్లో తాము వివక్ష చూపామని ఏనాడు కూడ విమర్శలు రాలేదని ఆయన గుర్తు చేశారు.

English summary
Union HRD minister Prakash Javadekar said that No facts in Ap chief minister Chandrababu naidu allegations,. He spoke to media at New Delhi on Wednesday along with party MPS GVL Narsimha Rao, and Haribabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X