వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవ తరగతిలో ఇంటర్నల్ మార్కులు రద్దు... ఏపీ విద్యాశాఖ మంత్రి

|
Google Oneindia TeluguNews

పదవ తరగతి పరీక్ష విధానంలో కీలక సంస్కరణలు తీసుకురానున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. పరీక్ష విధానంలో కూడ పలు మార్పులు చేశారు. ముఖ్యంగా వందమార్కుల పరీక్ష పేపరులో ఉండాల్సి బిట్ క్వశ్చన్ పేపరును ప్రత్యేకంగా ఇవ్వకుండా, జవాబు పత్రంతో పాటే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పరీక్ష సమయాన్ని కూడ మరో 15 నిమిషాలు పొడగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ విధానాలు రానున్న విద్యా సంవత్సరం నుండే అమలు కానున్నట్టు మంత్రి తెలిపారు.

20 శాతం ఇంటర్నల్ మార్కులు రద్దు

20 శాతం ఇంటర్నల్ మార్కులు రద్దు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవతరగతి పరీక్ష విధానంలో పలు కీలక మార్పులు తీసుకువచ్చింది. మాధ్యమిక విద్యావిధానంలో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించిన అనంతరం పలు నిర్ణయాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇందులో భాగంగానే పదవ తరగతి పరీక్షలో పలు మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా 20 శాతం ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల్లో కార్పోరేట్ పాఠశాలలు అక్రమాలకు పాల్పడుతున్నాయనే అభిప్రాయంతోనే వాటిని రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.

 బిట్ పేపర్ విధానం రద్దు

బిట్ పేపర్ విధానం రద్దు

సంస్కరణల్లో భాగంగా బిట్ పేపర్ విధానాన్ని కూడ రద్దు చేయనున్నట్టు మంత్రి ప్రకటించారు. జవాబులు రాసేందుకు 18 పేజీల బుక్‌లెట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపారు. నాలుగు రకాల ప్రశ్నల విధానంతో ఈ బుక్‌లెట్ ఉంటుందని ప్రకటించిన ఆయన ఇదివరకు ప్రత్యేకంగా ఇచ్చిన బిట్ పేపరును కూడ ముందుగానే ఇవ్వనున్నట్టు చెప్పారు. బిట్ పేపరు విధానం వల్ల సరైన నాణ్యత ప్రమాణాలు ఉండడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశ్నపత్రంలో భాగంగానే వీటిని ఇవ్వనున్నట్టు మంత్రి చెప్పారు. ఈ పద్దితి ద్వార మాస్‌కాపియింగ్ విధానాన్న అరి కట్టేందకు అవకాశం ఉంటుందని మంత్రి చెప్పారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రవేట్ స్కూళ్లలో కూడ అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలే కీలకం

పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలే కీలకం

ఇక ఈ సంధర్భంగానే రాష్ట్రంలో మొత్తం 45,390 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల ఎన్నికలు పూర్తి చేశామని చెప్పారు. కాగా మరో 927 పాఠశాలల్లో కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కమిటీలే ఫీజుల నియంత్రణతోపాటు ఇతర అంశాలను పర్యవేక్షిస్తాయని తెలిపారు. తల్లిదండ్రుల కమిటీలే చాల కీలకంగా వ్యవహరించనున్నాయని మంత్రి చెప్పారు. కమిటీలన్నింటికి త్వరలోనే శిక్షణ ఇస్తామని తెలిపారు. పిల్లలకు దుస్తులు, సైకిళ్లతోపాటు ఇతర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడంలో కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయని చెప్పారు.

English summary
Internal assement marks have been cancilled in in the ap 10 class exmaniations ap education minister adimulapu suresh said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X