వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కు ఆ మూడే తెలుసు.. మళ్ళీ వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే ..

|
Google Oneindia TeluguNews

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు . ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ ఎద్దేవా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సినిమాలైనా చెయ్యాలి లేదా రాజకీయాలైనా చేసుకోవాలి. కానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టటం మంచిది కాదని హితవు పలికారు. ఇక పవన్ కు తెలిసింది మూడు పెళ్ళిళ్ళు చేసుకోవటమే అంటూ పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు .

కరోనాను మించిన వైసీపీ వైరస్..8 నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తుంది : చంద్రబాబుకరోనాను మించిన వైసీపీ వైరస్..8 నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తుంది : చంద్రబాబు

 విశాఖ భూములపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

విశాఖ భూములపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీపై వైసీపీ ఎమ్మెల్యే ఫైర్

ఏపీలో రాజధాని అమరావతి విషయంలో కొనసాగుతున్న రగడ నేపధ్యంలో విశాఖ భూములపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఇక టీడీపీ విశాఖ భూముల విషయంలో నిజ నిర్ధారణ కమిటీ వేయడాన్ని వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ తప్పుబట్టారు. నిజనిర్ధారణ కమిటీని చంద్రబాబు మూడేళ్ళ క్రితమే వేయాల్సిందని ఆయన అన్నారు. హుద్ హుద్ తుఫాన్ లో భూముల రికార్డులు పోయాయని చెప్పిన టీడీపీ నాయకులు ఆనాడు నిజనిర్ధారణ కమిటీని ఎందుకు వేయలేదని ప్రశ్నించారు.

చంద్రన్న వైరస్‌కు మందులేదు

చంద్రన్న వైరస్‌కు మందులేదు

చంద్రన్న వైరస్‌కు ఆయన బతికున్నంత కాలం మందు దొరకదని అమర్ నాథ్ విమర్శించారు. విశాఖలో భూకుంభకోణం జరిగిందంటూ టీడీపీ తమపై అనవసర రాద్ధాంతం చేస్తోందని, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన వారికి లోకమంతా అలాగే కనుపడుతుందని మండిపడ్డారు. టీడీపీ హయంలో వేల ఎకరాలు కబ్జా అయిపోయాయని అన్నారు అమర్ నాథ్ . చంద్రబాబుకు ఏ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇష్టం లేదని, ఆయనకి మూడు గ్రామాల అభివృద్ధే కావాలని వాఖ్యానించారు.

ఉన్నవి మూడు, లేనివి కూడా మూడే .. ఘాటు వ్యాఖ్యలు

ఉన్నవి మూడు, లేనివి కూడా మూడే .. ఘాటు వ్యాఖ్యలు

ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై అమర్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు.పవన్‌కు ఉన్నవి మూడు, లేనివి కూడా మూడేనని తాను ఎప్పుడో చెప్పానని అమర్‌నాథ్ గుర్తుచేశారు. పవన్ కు సిద్ధాంతం, వ్యక్తిత్వం, స్థిరత్వం ఈ మూడు లేవని ఆయన వ్యాఖ్యానించారు . ఇక ఆయనకు ఉన్న మూడు ఏంటో ప్రజలందరకీ తెలుసంటూ పరోక్షంగా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావించారు. ఇక 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గ్లాస్ బద్దలు అయిపోయిందని వ్యాఖ్యానిం చారు అమర్‌నాథ్.

సినిమాలకు మధ్యలో రాజకీయాలు అవసరమా ?

సినిమాలకు మధ్యలో రాజకీయాలు అవసరమా ?

పవన్ సినిమాలైనా చేసుకోవాలి లేదా రాజకీయాలు అయినా చేసుకోవాలని సూచించారు. అంతేకానీ సినిమాలకు మధ్యలో రాజకీయాలు చేయడాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై , ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు . రాష్ట్రాన్నిఈ పార్టీల నాయకులు నాశనం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

English summary
YCP MLA Amarnath has criticized the former AP CM Chandrababu and Janasena Party chief Pawan Kalyan. If the coronavirus falls to the world, the AP will hit Chandrababu virus, said YCP MLA Gudivada Amar Nath . Pawan Kalyan concentrate only films or politics. But it is not fair to put legs on two boats. Pawan was known to make three weddings, and amar nath indirectly satires on Pawan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X