• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వింత వ్యాధి కేసుల్లేవ్: ఊపిరి పీల్చుకున్న ఏలూరు..కానీ కొనసాగుతున్న మిస్టరీ

|

వింత వ్యాధితో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు గురైన ఏలూరు క్రమంగా కోలుకుంటోంది. రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు ఏలూరులో వింత వ్యాధి కారణంగా 650 మంది అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. వీరిలో ముగ్గురు మరణించగా, మిగతావారంతా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారు కొందరికి తిరిగి వ్యాధి పునరావృతం కాగా వైద్యులు చికిత్స అందించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. డిశ్చార్జ్ తర్వాత కూడా ఏలూరు వింత వ్యాధి బాధితుల ఆరోగ్య వివరాలను వైద్య శాఖ అధికారులు ఎంక్వయిరీ చేస్తున్నారు.

అస్వస్థతకు గురైన ప్రాంతాలలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్య బృందాలు

అస్వస్థతకు గురైన ప్రాంతాలలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్య బృందాలు

ఇప్పటికే అస్వస్థతకు గురైన ప్రాంతాలలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్య బృందాలు, ఏలూరు లో వింత వ్యాధిబారిన పడిన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. వార్డు వాలంటీర్ ల ద్వారా ఏలూరు వాసుల ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ఎవరికీ ఎలాంటి అస్వస్థత కలిగిన వెంటనే చికిత్స అందిస్తున్నారు.

గత రెండు రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఏలూరు వాసులకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది.

వ్యాధికారకాలపై కొనసాగుతున్న అధ్యయనం

వ్యాధికారకాలపై కొనసాగుతున్న అధ్యయనం

అయినప్పటికీ వింత వ్యాధికి సంబంధించిన మిస్టరీ ఇంకా వీడలేదు. వ్యాధికారకాలపై ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది. మొదట తాగునీటిలో లెడ్ , నికెల్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తమైనా, తీరా పరిశోధనల తర్వాత తాగునీటిలో అలాంటి సమస్య ఏమీ లేదని తేలడంతో, ఇప్పుడు ఆహార పదార్థాలపై దృష్టిసారించి అధ్యయనం చేస్తున్నారు. మంచినీళ్ళు తాగడానికి భయపడుతున్న ఏలూరు ప్రజలకు ప్రభుత్వ ఆర్వో వాటర్ సరఫరా చేస్తుంది. బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని జగన్ సర్కార్ ప్రకటించింది.

ప్రజల భయాందోళన తొలగించే పనిలో జగన్ సర్కార్

ప్రజల భయాందోళన తొలగించే పనిలో జగన్ సర్కార్

ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని చెప్పిన సర్కార్, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సమాచారం అందించాలని పేర్కొంది. వాలంటీర్ల ద్వారా నిత్యావసరాలను ఇంటికే పంపుతున్నారు. మరోవైపు ఏలూరు వింత వ్యాధిపై ఢిల్లీ ఎయిమ్స్ , హైదరాబాద్లోని ఎన్ఐ ఎన్ , సిసిఎంబి, డబ్ల్యూహెచ్ఓ లాంటి సంస్థలు శాంపిళ్లను సేకరించి ఇప్పటికే అధ్యయనం చేస్తున్నాయి.

  Andhra Pradesh : ఆరుగురు సచివాలయ సిబ్బందిని విధుల నుండి తొలగింపు!!
  వింత వ్యాధి మిస్టరీ చేధించేందుకు నిపుణుల ప్రయత్నాలు

  వింత వ్యాధి మిస్టరీ చేధించేందుకు నిపుణుల ప్రయత్నాలు

  వింత వ్యాధి బాధితుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించిన నిపుణులు దీనిపై ఇంకా అధ్యయనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొత్త కేసులు నమోదు కాని పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకున్నా అసలు వ్యాధి కారణాలు తెలీక, మళ్లీ వ్యాధి పునరావృతమైతే ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సహజ వనరులు కలుషితం కావడం వల్లే ఇలా జరిగినట్టు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకా అస్వస్థతకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్న నిపుణులు మిస్టరీ చేధించాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

  English summary
  Eluru, is gradually recovering. Residents of Eluru feeling out of danger as not a single case was registered for two days. but the mystery was not revealed , the study is going still.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X