వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో తిరగటానికి పాస్ లు అక్కరలేదు .. సర్కార్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న ఏపీ ప్రజలు

|
Google Oneindia TeluguNews

ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. అంతరాష్ట్ర ప్రయాణాలకు పాసులు అసరం లేదని స్పష్టం చేసింది. అయితే కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చెయ్యాలని , అందరూ నిబంధనలను పాటించాలని షరతులు విధించింది.

Recommended Video

Lockdown : Big Relief To AP People,No Need Passes To Travel In AP

వైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదేవైసీపీ ఏడాది పాలన .. రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు,సదస్సులు .. షెడ్యూల్ ఇదే

కరోనాతో సహజీవనం చేసే పరిస్థితిలో లాక్ డౌన్ సడలింపులు

కరోనాతో సహజీవనం చేసే పరిస్థితిలో లాక్ డౌన్ సడలింపులు

కరోనా లాక్ డౌన్ కారణంగా కఠిన నిబంధనలు అమలు కావటంతో ఏపీలోని ప్రజలు మొన్నటి వరకు అంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ తో కరోనా ప్రభావం తగ్గుతుందని భావించినా కరోనా కేసులు నమోదు మాత్రం పెరుగుతూ పోతుంది. ఇక కరోనాతో సహజీవనం చెయ్యాల్సిన పరిస్థితి ఉందని , ఇప్పట్లో కరోనా తగ్గదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పేర్కొన్న నేపధ్యంలో అన్ని దేశాల్లో నిదానంగా లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఇండియాలో కూడా చాలా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించింది.

ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదన్న ప్రభుత్వ నిర్ణయం

ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదన్న ప్రభుత్వ నిర్ణయం

ఇక ఏపీలో కూడా లాక్ డౌన్ సడలింపులు ప్రకటించిన సర్కార్ యధావిధిగా జనజీవనం సాగించటానికి ప్రయత్నాలు చేస్తుంది .ఇక నిన్నటి దాకా వివిధ ప్రాంతాలకు వెళ్ళే వారికి స్పెషల్ ఈ పాసులను పోలీస్ శాఖ జారీ చేస్తున్న పరిస్థితి .అయితే తాజాగా ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు వెళ్లాలంటే పాసులు అక్కర్లేదని స్పష్టం చేసింది ఏపీ సర్కార్ . సొంత జిల్లాలకు వెళ్ళడానికి కూడా పాసులు తీసుకోవటం జనాలకు ఇబ్బందిగా మారింది . ప్రజలు పోలీసులకు పాసుల విషయంలో విజ్ఞప్తులు చేశారు . ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. దీంతో అంతర్ జిల్లాలకు వెళ్లాలంటే పాసులు అవసరం లేదని ఏపీ సర్కార్ పేర్కొంది . అయితే నిబంధనలు మాత్రం వర్తిస్తాయని మాత్రం చెప్తున్నారు పోలీసులు .

 అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలు ..ఇతర రాష్ట్రాల వారికి పర్మిషన్ తప్పనిసరి

అంతరాష్ట్ర ప్రయాణాలకు నిబంధనలు ..ఇతర రాష్ట్రాల వారికి పర్మిషన్ తప్పనిసరి

ఇక అంతరాష్ట్ర ప్రయాణాలకు వెసులుబాటు కల్పించామని ఇష్టారాజ్యంగా తిరిగితే ఊరుకోబోమని చెప్తున్నారు.ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని ఆ తరువాత బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి బయటకు వచ్చే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాలనుండి వచ్చేవారికి మాత్రం పర్మిషన్ తప్పనిసరి అని తెలిపారు. పర్మిషన్ లేకుంటే అనుమతించేది లేదని తేల్చి చెప్పారు . వారికి ఎమెర్జెన్సీ పనుల నిమిత్తం మాత్రమే అనుమతిస్తామన్నారు. వైద్యం, మరణాలు, లాంటి అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఇవనున్నట్టుగా పేర్కొన్నారు పోలీసులు .

English summary
It is clear that the AP people are not required the passes to travel from one district to another. People have made huge appeals to the police to go to their own districts. so, ap government taken the decision to relief the people. But the conditions will apply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X