వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలు తోడు వెయ్యాలంటే ఇక పెరుగు అక్కర్లేదు:రెడీమేడ్ తోడు రెడీ

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తిరుపతి:పాల ఉత్పత్తుల్లో పెరుగుకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు...అయితే ఈ పెరుగు తయారయ్యే విధానం అందరికీ తెలిసిందే. కాచిన పాలకు కాస్తంత పెరుగును తేదా మజ్జిగను తోడు వేస్తే మళ్లీ పెరుగు తయారవుతుంది. లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియా పాలను పులియబెట్టడం ద్వారా పెరుగుగా మార్చుతుంది.

అయితే మనం కొన్ని రోజులు ఊరెల్లి తిరిగి ఇంటికొచ్చేప్పుడు పాల ప్యాకెట్లయితే కొనుక్కొస్తాం గానీ వాటిని తోడు పెట్టాలంటే మాత్రం పల్లెటూళ్లలో అంత సమస్య కాకపోవచ్చు గానీ పట్టణాల్లో మాత్రం అది ఒక పెద్ద సమస్యే. కారణం వేళగాని వేళలో పక్కింటికి వెళ్లి తోడుకు పెరుగును అడగలేం...ఒకవేళ అడిగినా వారి దగ్గర లేకపోవచ్చు...అందుకే ఆ సమస్య పరిష్కారం కోసం తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు ఓ చక్కటి పరిష్కారం కనుగొన్నారు..అదే...రెడీమేడ్ పెరుగు.

పెరుగు తోడు...సమస్య

పెరుగు తోడు...సమస్య

మనం తెలుగులో "పెరుగు"గా వ్యవహరించే పాల ఉత్పత్తిని ఆంగ్లంలో "యోగర్ట్" అనీ హిందీలో "దహీ" అని అంటారు. మనిషికి ఆరోగ్యాన్నిచ్చే ముఖ్యమైన పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. పాలను తోడు వేయడం లేదా చేమిరి వేయఅందుబాటులో లేకపోడమే ఈ సమస్యకు మూలకారణం. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం సఫలం అయింది. ఫలితంగా పెరుగు లేకుండానే పాలను తోడు పెట్టవచ్చు. అదెలా సాధ్యమంటారా?...

ఆ బాక్టీరియాదే...కీలకం

ఆ బాక్టీరియాదే...కీలకం

పాలు పెరుగుగా మారటానికి ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియాదే కీలకపాత్ర. దీంతో ఆ బాక్టీరియా మీద ఈ శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేశారు. ఆర్‌కెవీవై ప్రాజెక్టు కింద డాక్టర్‌ నాగేశ్వరరావు నేతృత్వంలో సాగుతున్న ఈ పరిశోధన తొలిదశ విజయవంతంగా పూర్తయినట్లు తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందుకోసం వివిధ ప్రాంతాల నుంచి పాల శాంపిల్స్‌ను సేకరించి వాటిపై ల్యాక్టో బాసిల్లస్ బ్యాక్టీరియాను ప్రయోగించి...మూడుదశల్లో చర్యలు జరిపించి రెడీ టూ యూజ్ లాగా ఉపయోగపడే ఒక ప్రత్యేకమైన తుది పదార్థాన్ని రాబట్టారు. దీన్ని రెడీమేడ్ తోడుగా అభివర్ణించవచ్చు. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది.

రెడీమేడ్ తోడు...పౌడర్ రెడీ

రెడీమేడ్ తోడు...పౌడర్ రెడీ

ఈ రెడీమేడ్ తోడు ప్యాకెట్... లేదా చేమిరి సాచెట్ ను ఒక్కసారి కొనుగోలు చేసి ఇంట్లో పడేస్తే అది అయిపోయేంతవరకు పాలను తోడు వేసేందుకు పెరుగు కోసం వెతుక్కునే పని లేకుండా పెరుగును సిద్దం చేసుకోవచ్చు. పైగా ఈ రెడీమేడ్ తోడు వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది...సాధారణంగా పెరుగు తోడుకోవాలంటే 4 నుంచి 6 గంటలు పడుతుంది. శీతాకాలంలో అయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ రెడీమేడ్ తోడుతో కేవలం రెండు నుంచి మూడు గంటల్లోనే పెరుగు తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత ఆరోగ్యం...అతి త్వరలో

మరింత ఆరోగ్యం...అతి త్వరలో

అయితే ప్రతి పదార్థానికి ఎక్స్ పెయిరీ తేదీ ఉంటుంది...అలాగే ఈ రెడీమేడ్ తోడుకు కూడా ఎన్ని రోజుల వరకూ పాడవకుండా నిలవ ఉంటుందో ఆ తేదీని నిర్ధారిస్తారు.
సాధారణ పద్దతిలో ఇంట్లో తయారయ్యే పెరుగు కంటే ఇలా రెడీమేడ్ తోడు ద్వారా తయారైన పెరుగు మరింత ఆరోగ్యకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణ పెరుగు తినడం వల్ల కడుపులో చేరే లాక్టిక్‌ ఆసిడ్‌ కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుందన్నారు. అయితే తాము తయారుచేసిన ప్రో బయోటిక్‌ కల్చర్‌ పౌడర్‌ను తోడు వేయడం ద్వారా తయారయ్యే పెరుగు వల్ల అలాంటి సమస్యలు ఉండవన్నారు. ఈ తరహా పౌడర్‌కు ‘రెడీ టు ప్రో బయోటిక్‌ కర్డ్‌' అని నామకరణం చేయనున్నట్లు వారు తెలిపారు. అతి త్వరలోనే దీన్ని మార్కెట్ లోకి తీసుకురానున్నట్లు తిరుపతి వెటర్నరీ వర్సిటీ డెయిరీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
Tirupathi:Tirupathi veterinary university scientists invented the ready-made compound without the need of yoghurt. This ready made powder is called probiotic curd powder. This packets will be soon in market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X