వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త పార్టీ తూచ్!: ఢిల్లీని బెదిరించేందుకేనన్న రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: కొత్త పార్టీని స్థాపించే ఆలోచన ఏదీ లేదని, అధిష్ఠానాన్ని బెదిరించి, విభజనపై వారి నిర్ణయాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే కొత్త పార్టీ అంశాన్ని తెరపైకి తెచ్చానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు శనివారం గుంటూరులో చెప్పారు.

ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని, 2014 వరకు మార్పు ఉండబోదని, కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. సిఎం మార్పుపై అధిష్ఠానం సుముఖంగా లేదన్నారు. విభజన అంశంలో ఆది నుంచి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్ఠానానికి విధేయత ప్రదర్శించబట్టే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు తలెత్తాయన్నారు.

తెలంగాణ వారు ప్రతిదీ వాళ్లకే కావాలంటున్నారని, ఇక్కడ సీమాంద్రులెవ్వరూ గాజులు తొడుక్కొని లేరన్నారు. సిఎం కుర్చీలో ఎవరున్నా అన్ని ప్రాంతాల వారు గౌరవించాలని, కిరణ్‌ను అసభ్యంగా, అవమానకర రీతిలో విమర్శిస్తే చూస్తూ ఉరుకోమన్నారు. ఈ నెల 18న సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు భేటీకానున్నట్టు చెప్పారు.

కిరణ్ పార్టీ పెట్టరు: పితాని

ముఖ్యమంత్రి సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో లేనేలేరని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. చవఎం సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు వస్తున్న ప్రచారాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అలాంటిదేమీ లేదు, అంతర్గత చర్చల్లో కూడా ఈ ప్రస్తావన లేదని బదులిచ్చారు. సమైక్యాంధ్ర విషయంలో అసెంబ్లీలో తేల్చుకున్న తరువాత ఢిల్లీ వరకు కూడా ఇలాంటి పోరాటం చేయాలనే భావనలోనే సిఎం ఉన్నట్టుగా మంత్రి పేర్కొన్నారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao on Saturday said they are not planning to float New Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X