కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అవసరం: ఇదే జరుగుతుంది... ఏపీ ప్రజలకు జనసేనాని సరికొత్త పిలుపు

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కర్నూలు జిల్లా పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తన జిల్లా పర్యటనలో అధికార, విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన పాత్ర లేకుండా వచ్చే ప్రభుత్వం ఏర్పడదని, తాను సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారిస్తున్నానని వ్యాఖ్యానించారు.

రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్రెడ్డి అంటే ఇదీ, వారిని చూస్తేనే అసహ్యమేసింది, టీజీతో మాట్లాడుతా: పవన్ కళ్యాణ్

పదవులు పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్

పదవులు పక్కనపెట్టిన పవన్ కళ్యాణ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో త్రిముఖ పోరు ఉంటుందనే విషయం తెలిసిందే. టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య పోరు ఉండనుంది. 175 స్థానాల్లో తామే ఎక్కువ చోట్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అధికార, ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కానీ జనసేనాని మాత్రం తమకు పదవులు కాదని, ప్రజలకు మంచి చేసేందుకు అధికారం వచ్చినా, రాకున్నా పని చేస్తామని చెబుతున్నారు. మీరు తనను సీఎంగా చేసినా, చేయకపోయినా ప్రజల కోసం పని చేస్తానని చెబుతున్నారు.

 ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సరికొత్త పిలుపు

ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ సరికొత్త పిలుపు

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మరోసారి వచ్చే ఎన్నికల అనంతరం జనసేన కీలకం కానుందని వ్యాఖ్యానించారు. నేను రాత్రికి రాత్రి గొప్ప మార్పులు తీసుకు వస్తానని చెప్పడం లేదని, కానీ ఒక వ్యక్తికి పరిపాలన అప్పగిస్తే పెద్దస్థాయి నుంచి దిగువస్థాయి వరకు అస్తవ్యస్థమవుతుందని, అందుకే అందరం సంకీర్ణ ప్రభుత్వాల పైనే దృష్టి పెడదామని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. తద్వారా ఏపీ ప్రజలకు కూడా సంకీర్ణ ప్రభుత్వాలపై దృష్టి సారించాలని కొత్త పిలుపు ఇచ్చారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ లేదా టీడీపీ మాత్రమే సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉంది. ఇప్పుడు పవన్ సరికొత్త పిలుపు ఇచ్చారు.

 గెలుపుపై ధీమా లేకున్నా.. కర్ణాటక తరహా సంకీర్ణంపై ధీమా

గెలుపుపై ధీమా లేకున్నా.. కర్ణాటక తరహా సంకీర్ణంపై ధీమా

వచ్చేసారి వస్తే టీడీపీ లేదా వైసీపీ గెలుస్తుందని ఆయా పార్టీలు చెబుతున్నాయి. కానీ జనసేన మాత్రం తాము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు గెలుస్తామని కచ్చితంగా చెప్పడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వచ్చినా జనసేన కీలకం కానుందని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలు ఇక్కడ రిపీట్ అవుతాయని భావిస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఉంటుందని, జనసేన కారణంగా టీడీపీ, వైసీపీలకు మెజార్టీ రాదని, అప్పుడు ఏ పార్టీకి అవసరమైన జనసేన అవసరం ఖాయమని చాలామంది భావిస్తున్నారు. ఈ కారణంగానే పవన్ విషయంలో టీడీపీ, వైసీపీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే విమర్శలు లేదా అనధికార స్నేహం అన్నవిధంగా వ్యవహరిస్తున్నారు.

English summary
Jana Sena chief Pawan Kalyan gave a call to people to seek change from the present systems as they were steeped in corruption, inefficiency, favouritism and had no potential to transform their lives for the better. He said that no government could be formed in AP without Jana Sena and affirmed positive politics would bring the much needed change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X