వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవ్వరు ఆపలేరు: రాములమ్మ, యు టర్న్‌పై పొంగులేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

VIjayasanthi
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఈ దశలో ఉన్న సమయంలో ఎవరూ ఆపలేరని మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆదివారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై కాంగ్రెసు పార్టీ వేగంగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో దీనిని ఆపడం ఎవరివల్ల కాదన్నారు.

రోజులు మారాయి కాబట్టి పార్టీ మారానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన కాంగ్రెస్‌ను నమ్మాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు అడ్డుతగిలిన వారి చెంప చెళ్లుమనిపిస్తానని చెప్పారు. గౌరవం లేనిచోట ఉండటం కష్టమన్నారు.

బంగారు తెలంగాణ: మురళీధర రావు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణ అవుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు వేరుగా అన్నారు. తెలంగాణలో ఉన్న వనరులను అన్నింటిని వినియోగించుకోవడం ద్వారా బంగారు తెలంగాణను అభివృద్ధి చేసుకుందామన్నారు.

జగన్, బాబులపై పొంగులేటి ఫైర్

కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన మండలి సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల పైన ధ్వజమెత్తారు. విభజన అనివార్యమని టిడిపి, జగన్ పార్టీలు గుర్తించాలన్నారు. ఆ పార్టీలు ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందామన్నారు.

టిడిపి ఎంపీలు శనివారం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు తెలంగాణపై యూ టర్న్ తీసుకోవడం సరికాదన్నారు.

English summary
Medak MP VIjayasanthi on Sunday said having reached this state now, no one can stop Telangana state formation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X