వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్, కూకట్‌పల్లిలో సుహాసిని తరఫున రోడ్డుషోకు నో పర్మిషన్: కారణమిదే

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ పోలీసుల నుంచి షాక్ తగిలింది. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున నందమూరి సుహాసిని పోటీ చేస్తున్నారు. ఆమెకు మద్దతుగా టీడీపీ అధినేత గురువారం రోడ్డు షో నిర్వహించాలనుకున్నారు.

ఇందుకోసం పోలీసుల అనుమతి అడిగారు. గురువారం కూకట్‌పల్లిలో సుహాసిని తరఫున రోడ్డు షో నిర్వహణకు అనుమతి కావాలని కోరగా, పోలీసులు నిరాకరించారు. అందుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు రోడ్డు షోకు అనుమతి ఇచ్చామని పోలీసులు తెలిపారు. ఒకేరోజు ఇద్దరికి అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు.

No permission to AP CM Chandrababu Naidus roadshow in Kukatpally

కాగా, ఖమ్మం బహిరంగ సభతో తెలంగాణలో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత హైదరాబాదులో సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేపు కూకట్‌పల్లిలో సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్ షోకు అనుమతి నో చెప్పారు.

English summary
Telangana police did not give permission to Andhra Pradesh chief Minister and Telugudesam party national president for Kukatpally roadshow on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X