విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ విశాఖ ర్యాలీకి నో పర్మిషన్: నేడు చంద్రబాబు టూర్ కు అడుగడుగునా ఆంక్షలు

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నేడు విశాఖపట్నంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించనున్నారు. నేటి నుండి మూడు రోజుల పాటు జీవో 107పై ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఈ నేపధ్యంలో ఆయన ప్రజా చైతన్య యాత్రకు పోలీసులు షాక్ ఇచ్చారు. గురువారం విశాఖలో టీడీపీ చంద్రబాబు వస్తున్న నేపధ్యంలో తలపెట్టిన ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ఏం జరగబోతుందనే టెన్షన్ నెలకొంది.

Recommended Video

Go Back Chandrababu Slogans By Activists At Visakhapatnam | Oneindia Telugu

జీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణజీవో 107పై టీడీపీ యాక్షన్ ప్లాన్ .. మూడు రోజుల పాటు కార్యాచరణ

 చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్

చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్

చంద్రబాబు పర్యటనకు మాత్రమే ఆంక్షలతో కూడిన పర్మిషన్ ఇచ్చారు పోలీసులు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు . అది కూడా కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో పర్యటించాలని పేర్కొన్నారు . అయితే చంద్రబాబు సైతం ఎలాంటి ర్యాలీలు చేయకూడదన్నారు. కావాలనే చంద్రబాబు పర్యటనకు పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని, ఇదంతా అధికార వైసీపీ కుట్ర అని విశాఖ పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవాలనే ప్లాన్ లో వైసీపీ

చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లోనే అడ్డుకోవాలనే ప్లాన్ లో వైసీపీ

ఇక చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర నేపధ్యంలో అధికార వైసీపీ నేతలు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు విశాఖ ఎయిర్‌ పోర్టుకు రాగానే ఆయన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని విశాఖ వస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ సహా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశావని, ప్రజా చైతన్యయాత్రకు వస్తున్నావని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు .

విశాఖని రాజధానిగా ఒప్పుకోని బాబు పర్యటనపై వైసీపీ ఆగ్రహం

విశాఖని రాజధానిగా ఒప్పుకోని బాబు పర్యటనపై వైసీపీ ఆగ్రహం

ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు అడుగడుగునా ఇబ్బందులు కలిగిస్తూ కేవలం అమరావతి మాత్రమే రాజధాని అంటున్న చంద్రబాబు తీరును విశాఖ వాసులు సైతం తప్పుబడుతున్నారు. మూడు రాజధానులను ఏపీ ప్రభుత్వం ప్రకటించిన దానికి భిన్నంగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అడ్డుకోవాలని వైసీపీ నేతలు, టూర్ ను సక్సెస్ చెయ్యాలని ప్రయత్నిస్తున్న క్రమంలో ఇవాళ్టి చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

 విశాఖ బాబు పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

విశాఖ బాబు పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ

ఇప్పటికే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలలో పర్యటించి వైసీపీ 9 నెలల పాలనలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు . ఇక తాజా పరిణామాల నేపధ్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సైతం సిద్ధం చేస్తూ చంద్రబాబు పర్యటన సాగుతుంది. కానీ విశాఖలో పోలీసుల ఆంక్షలు, అటు అడ్డుకునే ఎత్తుగడలో వైసీపీ ఉండటంతో నేడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.

English summary
TDP President and former CM Chandrababu will hold a praja chaitanya yathra in Visakhapatnam today. A large-scale campaign on the G.O 107 will be held for three days from today. It was in this backdrop that the police shocked his tour. The police did not grant permission for a rally that was staged in the wake of the TDP chief Chandrababu in Visakha on Thursday. Against this backdrop, there is a tension in Visakha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X