గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కురుక్షేత్ర సభకు అనుమతి లేదు, గుంటూరులో రావెల ఫ్లెక్సీల కలకలం

ఎంఆర్ పి ఎస్ కురుక్షేత్ర సభకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఈ సభను నిర్వహించి తీరుతామని ఎంఆర్ పిఎస్ ప్రకటించింది. అయితే ఈ సభకు తరలిరావాలంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పేరుతో గుంటూర

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఎంఆర్ పి ఎస్ కురుక్షేత్ర సభకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.అయితే ఈ సభను నిర్వహించి తీరుతామని ఎంఆర్ పిఎస్ ప్రకటించింది. అయితే ఈ సభకు తరలిరావాలంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు పేరుతో గుంటూరు జిల్లాలో వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

ఈ నెల 7వ, తేదిన గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఎంఆర్‌పిఎస్ కురుక్షేత్రసభను నిర్వహించాలని నిర్ణయం తీసుకొంది.

ఎంఆర్ పి ఎస్ వ్యవస్థాపక వార్షికోత్సవ సభ నిర్వహణకు గాను కురుక్షేత్ర సభ పేరుతో మందకృష్ణ మాదిగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సభకు హైకోర్టు నుండి అనుమతి తీసుకోనైనా సరే నిర్వహిస్తామని ఎంఆర్‌పిఎస్ ప్రకటించింది. ఈ మేరకు తమ అనుమతులు వచ్చాయని ఆ సంస్థ నాయకులు చెబుతున్నారు. కానీ, అలాంటి ఉత్తర్వులు రాలేదని పోలీసులు ప్రకటించారు.

NO permission to Mrps kurukshetra meeting:N. China Rajappa

కురుక్షేత్ర సభకు అనుమతి లేదు

ఎంఆర్‌పిఎస్ కురుక్షేత్ర సభకు అనుమతి లేదని ఏపీ డిప్యూటీ సిఎం, నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. ఈ సభ నిర్వహణకు గాను ఎంఆర్‌పిఎస్ ఎలాంటి ముందస్థు అనుమతులను తీసుకోలేదని ఆయన గురువారం నాడు ప్రకటించారు. ఎవరికి వారు సభలు, సమావేశాలు నిర్వహిస్తే ఎలా అనుమతులిస్తారని ఆయన ప్రకటించారు. ముందస్తు అనుమతి అడిగితే పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.

రావెల కిషోర్ బాబు పేరుతో ఫ్లెక్సీల కలకలం
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో పేరుతో గుంటూరు జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కురుక్షేత్ర సభకు రావాలంటూ రావెల పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరుగుతున్నారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఈ సభ నిర్వహిస్తున్నారనే అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో ఈ సభకు హజరుకావాలంటూ రావెల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
NO permission to Mrps kurukshetra meeting said Ap Deputy CM N. China Rajappa on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X